రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం అంటే టీఆర్ఎస్ ఎంపీలు పారిపోవడమే – లక్ష్మణ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

-

టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం అంటే పారిపోవడమే అని దీని వల్ల రాష్ట్రానికి ఒగూరే ప్రయోజనం ఏమీ లేదని అన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్. రాచరిక వ్యవస్థకు అలవాటు పడ్డ వ్యక్తి కేసీఆర్… ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఆయనకు నమ్మకం లేదని విమర్శించారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను మర్చిపోయిందని.. అన్ని వర్గాలు హామీల పై ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. 51 శాతం చైనా ప్రజలు మోదీ వైపు మొగ్గు చూపుతున్నారని గ్లోబల్ టైమ్స్ చెప్పిందని వెల్లడించారు. కళ్లు ఉండి చూడలేని పార్టీగా అధికార పార్టీ మారిందని.. రైతుబంధు ఇస్తూ అన్నింటిని బంద్ పెట్టిందని దుయ్యబట్టారు. జబ్బలు చర్చుకునే ఇక్కడి పెద్దలు ఒక్కసారి ఉత్తర ప్రదేశ్ వెళ్లి వస్తే తెలుస్తుంది… అక్కడ ఏమి జరుగుతుందో… అని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ పేదల సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదని.. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన హామీలో ప్రకటించ లేదని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని అజయ్ మిశ్రా నాయకత్వంలోని రాష్ట్ర కమిటీ ఇప్పటికే స్పష్టం చేసిందని లక్ష్మ ణ్ అన్నారు. గతంలో స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఆందోళన చేస్తున్నారని… కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పాపం కాంగ్రెస్ పార్టీదే అని ఆయన అన్నారు. 2016.17 లో కేంద్రం కాజీపేట లో రైల్వే ఓవరలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు 198 కోట్లు మంజూరు చేసిందని.. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు సరి అయిన భూమిని ఇవ్వలేదని అన్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news