
మండల కేంద్రం జనగామ రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ట్రాక్టర్ అదుపుతప్పడం వలన ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదంలో ఒకరు ప్రాణాలను కోల్పోయారు. ఇంకొకరికి గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వ్యక్తిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.