ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రభుత్వ అధికారులు అధిక సంఖ్యలో కరోనా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు అధికారులకు కరోనా సోకగా తాజాగా భూపాలపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో పాటు భూపాలపల్లి ఎస్ఐ సైతం కరోనా బారిన పడ్డారు. ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు 100 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100 మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారు.