ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరిటెండెంట్ డాక్టర్ ప్రభావతికి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.
హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరిటెండెంట్ డాక్టర్ ప్రభావతికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన డాక్టర్ ప్రభావతి…హైదరాబాద్ ఉందని సమాచారం. నిన్న జరగాల్సిన విచారణకు డుమ్మా కొట్టింది ప్రభావతి. ఈ తరుణంలోనే… డాక్టర్ ప్రభావతికి మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.