రైతు భరోసా నిబంధనలు..ఈ రైతులు మాత్రమే అర్హులు !

-

 

తెలంగాణ రైతులకు బిగ్‌ అలర్ట్‌. రైతు భరోసా నిబంధనలు విడుదల అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయుటకు కట్టుబడి ఉందని సర్కార్‌ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్దతులు ఆచరించడానికి, అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చు అని తెలిపింది.

Telangana Rythu Bharosa Guidelines

రైతు భరోసా నిబంధనలు

1. ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి, ఆహార భద్రతకు కూడా తోడ్పడుతుంది. అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

2. ఇందుకోసం, తెలంగాణ ప్రభుత్వం “రైతుభరోసా” పథకాన్ని అమలుచేయడానికి నిర్ణయించింది. ఈ పథకం జనవరి 26, 2025 నుండి అమలు చేయబడుతుంది.

3. రైతుభరోసా పథకంలోని ముఖ్యాంశాలు:

3.1 రైతుభరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు రూ.12,000 కు పెంచబడింది.

3.2 భూభారతి (ధరణి) పోర్టల్ లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా సహాయం అందించాలి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుండి తొలగించాలి.

3.3 ROFR పట్టాదారులు కూడా రైతు భరోసాకి అర్హులు.

3.4 RBI నిర్వహించే DBT పద్ధతిలో రైతుభరోసా సహాయం రైతుల ఖాతాలో జమ చేయాలి.

3.5 రైతుభరోసా పథకం వ్యవసాయశాఖ సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వం వారు అమలు చేస్తారు.

3.6 National Informatics Centre (NIC), IT ఈ పథకానికి భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version