ఓమిక్రాన్ వేరియంట్ పై డబ్యూహెచ్‌వో కీలక ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వ్యాప్తి తగ్గిందని డబ్యూహెచ్‌వో వెల్లడించింది. గత వారం రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు గమనిస్తే.. వ్యాప్తి కొంత వరకు తగ్గిందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా గత వారంలో 1.8 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయని డబ్యూహెచ్‌వో తెలిపింది. ఇది దీని కంటే ముందు వారంతో పోలిస్తే.. 20 శాతమే కేసులు పెరిగాయని వెల్లడించింది.
గత నెలలో 50 శాతానికి పైగా కేసులు పెరిగాయని గుర్తు చేసింది. అయితే కేసుల రేటు తగ్గినా.. మరణాల సంఖ్యలో మాత్రం పెద్ద తేడాలు లేవని డబ్యూహెచ్‌వో ప్రతినిధుల అన్నారు. గత వారం ప్రపంచ వ్యాప్తంగా 45 వేల మరణాలు సంబవించాయని తెలిపారు. కానీ నైరుతి ఆసియాలో మాత్రం ఓమిక్రాన్ వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉందని వెల్లడించింది. గత వారంలో నైరుతి ఆసియా దేశాలలో 145 శాతానికి పైగా కరోనా కేసులు పెరిగాయని తెలిపారు.