వరంగల్ జిల్లాలోని 10 మండలాల్లో వర్ష ప్రభావంతో 191 గ్రామాల్లోని 18,946 రైతులకు సంబంధించిన రూ.200కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అత్యధికంగా వర్షం కురిసిన నర్సంపేట డివిజన్లో 14వేల ఎకరాల్లో మిర్చి, 9,255 ఎకరాల్లో మొక్కజొన్న, 100 ఎకరాల్లో వేరుశనగ, 55 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 126 ఎకరాల్లో అరటితోటలు దెబ్బతిన్నాయని అధికారుల సర్వేలో గుర్తించారు.