వ్యాక్సినేషన్ పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందని చెప్పారు. మొదటి డోస్ సమయంలో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చాలా సహకారం అందించారన్నారు. 15-18 ఏళ్ల మధ్యవారిలో కేవలం వారం వ్యవధిలో 38 శాతం మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తయిందని మంత్రి వివరించారు.