తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 1,825 కరోనా కేసులు వెలుగు చూశాయి. అయితే నిన్నటితో పోలిస్తే.. 152 కరోనా కేసులు పెరిగాయి. కాగ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 1,825 మంది కరోనా బారిన పడ్డారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నేటి కరోనా బులిటెన్ ను కూడా విడుదల చేశారు. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో రాష్ట్రంలో కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. కాగ నేడు కరోనా మహమ్మారి నుంచి 350 మంది కోలుకున్నారు.
దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 14,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో 70,697 శాంపిల్స్ ను పరీక్షించారు. అయితే కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో, అధికారుల్లో ఆందోళన నెలకొంది. అయితే రాష్ట్రంలో కరోనా ఆంక్షలను ఈ నెల 20 వరకు పెంచడంతో రోజు వారి కేసుల సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉంది. కాగ ప్రజలు అందరూ కరోనా నిబంధనలు పాటిస్తే కరోనా కేసుల సంఖ్య ను అదుపులో ఉంచవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.