రంగారెడ్డి : లవ్ ఫెయిల్యూర్.. యువకుడు సుసైడ్

-

ప్రేమ విఫలమైందని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన షాద్‌నగర్‌లోని చెటాన్పల్లిలో జరిగింది. రైల్వే పోలీసుల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని నిమ్మచురుకు చెందిన ఉదయం సింగ్ కొంతకాలంగా స్థానికంగా పనిచేస్తున్నారు. గత రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version