టాక్ షోలో అభిమానికి వార్నింగ్ ఇచ్చిన బాల‌య్య‌…వాడు ఖ‌తం అంటూ..!

-

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఆహాలో అన్ స్టాప‌బుల్ ఎన్బీకే అనే టాక్ షో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ టాక్ షో బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోలుగా నిలిచింది. త‌న దైన స్టైల్ లో బాల‌య్య రెచ్చిపోతున్నారు. వినోదానికి హ‌ద్దులు లేవంటూ నిరూపిస్తున్నారు. ఇక బాల‌య్య హోస్ట్ కావ‌డంతో ఇండ‌స్ట్రీ నుండి ప్ర‌ముఖులు ఈ టాక్ షోకు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ఈ టాక్ షోకు మ‌హేశ్ బాబు, రాజ‌మౌళి, సుకుమార్, అల్లు అర్జున్, మోహ‌న్ బాబు లాంటి ప్ర‌ముఖులు విచ్చేసి సంద‌డి చేశారు. ఇక సంక్రాంతి సంద‌ర్భంగా ఈ షోకు లైగ‌ర్ టీమ్ వ‌చ్చి సంద‌డి చేసింది.

ఇక ఈ షో ప్రోమో విడుద‌ల కాగా అందులో బాల‌య్య ఓ అభిమానికి వార్నింగ్ ఇచ్చారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను తాను మొద‌ట‌గా న‌టించిన సినిమా ఏదంటూ బాల‌య్య ప్ర‌శ్నించారు. దానికి విజ‌య్ త‌డ‌బ‌డ‌గా అక్క‌డే ఉన్న అభిమాని తాత‌మ్మ‌క‌థ అంటూ స‌మాధానం ఇచ్చాడు. దాంతో బాల‌య్య ఆ అభిమానికి వాడు నా చేతిలో అయిపోయాడు…ఖ‌తం అంటూ స‌ర‌దాగా వార్నింగ్ ఇచ్చాడు. అంతే కాకుండా తాను టాక్ షో అన‌గానే మ‌డిక‌ట్టుకుని కూర్చోన‌ని తాను ముందే నిర్వాహ‌కుల‌కు చెప్పాన‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version