హ్యాపీ బ‌డ్జెట్ డే : జ్యోతిషం చెప్ప‌ని లోటు

-

ప‌న్నుల‌న్నీ ప్ర‌త్య‌క్షాలు ప‌రోక్షాలు..జీవితాల‌న్నీ ప‌ర్యాయాలు విప‌ర్యాయాలు విలోమాలు/అనుపాతాలు/హెచ్చింపుల‌కు ఒక గ‌డ‌స‌రి సూత్రం ఆపాదించి ఇదే ప్ర‌గ‌తి అని చెప్పావే అనుకో అదే బడ్జెట్ /ఏటా గార‌డీ చేసి కొన్ని వేల మందికి ప్ర‌యోజనం క‌ల్పించామ‌న్న ఆశ‌తో కోట్ల మంది క‌న్నుగ‌ప్ప‌డం సులువు/తెలుగిం టి కోడ‌లు ఏం ఇస్తారో ఇవ్వ‌రో అన్న ఆశ‌లేదు.. ఇవ్వాల్సిన ప‌నీ లేదు. ఎందుకంటే ఆమెకు నిధుల‌న్నీ కొన్ని కేటాయింపుల‌కే ప‌రిమితం చేయాల‌న్న ఆజ్ఞ ఒక‌టి ఇప్ప‌టికే వ‌చ్చి ఉంటుంది.

ఫ‌స్ట్ కాజ్ : నేడు అన‌గా ఫిబ్ర‌వ‌రి ఒక‌టి కేంద్ర బడ్జెట్

ఏం దాచుకోవాలో అన్న‌ది తెలియాలి..ఎంత తోచినా చెప్ప‌కూడ‌దు అన్న పొ దుపు సూత్రం ఒక‌టి కోటినొక్క రీతిలో పాటించాలి.. విస్తుబోయే నిజాలే అవి కానీ ఈ ఉద‌యం రేప‌టి ఉద‌యం ఆ ద‌రిద్ర‌గొట్టు మీడియా రాస్తే చ‌దివి త‌నివి తీ ర్చుకోవాలి.ఈ సారికే అంకెలు సున్నాల‌ను పోగేసుకుని ఉంటాయి.లేదా కొ న్ని సున్నాలు ప‌క్క‌న అంకెలు రంకెలు వేసుకుని ఉంటాయి.ఈ సూటు కేసు ప‌త్రాలు ఈ స‌ప్త‌మి రోజున ఒకింత కొత్త ప‌రుగు అందుకుంటాయని ముంబయ్ మార్కెట్టూ, శ్రీ‌కాకుళం మార్కెట్లూ హాయిగా ఆశ‌బోతు త‌నంతో ఉంటాయి.సామాన్యుడికి అంద‌ని పదాల‌ను ప్ర‌తిపాదితంగా ఇన్నాళ్లూ చెబుతూనే ఉన్నారు. ఇవ్వాల్సినంత ఇవ్వ‌క లోటు పేరిట వినిమ‌య లోటు పేరిట టోకున మోసాల‌ ను చెలామ‌ణీ చేయ‌డం ఈ ప్ర‌భుత్వాలు అనుభ‌వంలోకి తెచ్చిన సూత్రం.

రూపాయి ఎలా పోతుంది
ఎక్క‌డికి పోతుంది
అంతా డ్రామా
మోడీకి తెలియ‌కుండా
బ్యాంకోడికి తెలియ‌కుండా

బియ్యం కొట్టోడికి /పాలోడి/ పేప‌రోడికి/ప‌నోడికి తెలియ‌కుండా..రూపాయి ఎక్క‌ డికి వెళ్తుంది/ఉట్టిదే ఏవీ ఎక్క‌డికీ పోవు..పైస‌ల‌న్నీ వివేచ‌న కోల్పోయి వి దేశీ రుణాల పేరిట అర్రులు చాస్తాయి.కాల్మొక్కుతా అన్నోడికి ఒక‌లా,కుమ్ముతా..నా కొడ‌కా అన్నోడికి ఒక‌లా నిధులు విదిలింపు ఉంటుంది..ఈ సారి బంగారం రుణా లు,తాక‌ట్టు రుణాలు వీటిపై వ‌డ్డీ రేట్లు త‌గ్గించి ఉప‌శ‌మ‌ న చ‌ర్య‌లు చేప‌ట్టి ఒక్క‌ సారి కేంద్రం ప్రేమ‌ను అప్ర‌క‌టితంగానే కాక ప్ర‌క‌టితంగా ప్ర‌క‌టిస్తున్న‌ద‌ని అనుకో వ‌డం అవివేకం..గృహరుణగ్ర‌స్తులు పెట్టుబ‌డిదారులూ, ద‌వఖానా నిర్వాహ‌కు లు,రియ‌ల్ట‌ర్లూ వీరంతా ఎందుక‌ని ఇలా మోసపోతూ పోతూ ఉన్నార‌ని.. డిపాజిట్ల‌కు రెక్క‌లు రావు..కానీ బ్యాంకోడు ఆ డ‌బ్బుల‌ను ఉన్నోడికి పైర‌వీ అ న్నోడికి ఇస్తాయి.

ఈ సారి బ్యాంకోడి జీతం పెర‌గాలి ఆ కోడి కూత పెర‌గాలి.. ఆ కోడ్ ఈ కోడ్ అన్నీ/అన్నీ అర్థం అయి చావ‌క ఉండాలి..కొన్ని దాంప‌త్య నిరోధ‌క మాత్ర‌ల ధ‌ర‌లు త‌ గ్గి, బ్రాందీ, విస్కీ ధ‌ర‌లు సిగిరెట్ట ధ‌ర‌లు మాత్రం ఆమాంతం పెరిగి జీవితాల‌కు జ‌ బ్బుల‌ను అంటించ‌కుండా ఉండాలి.అలా చేస్తే తెలుగింటి కోడ‌లు కొంత సాధించినార‌ని ఆనందించెద‌న్.. ఏమ‌యినా ఈ సారి అత్యాశ‌ల‌ కు పోని తీరు ఒక‌టి ఉంటే ఆ రేఖా సూత్ర‌త ఒక‌టి ఈ రాష్ట్రం కూడా పాటిస్తే బా గుంటుంది. స‌న్నాసు లంతా బ్యాంకుల‌ను బ్యాంకుల‌న్నీ/సామాన్యుల‌నూ ఓ ప‌ట్టాన మోసం చేసు కుంటూ పోకుండా ఉండాల‌ని అనుకోవ‌డం ఓ అవివేకం.. సూరీడు రాని స‌ప్త‌మి వేళ మా అదృష్ట దీప‌క్ కు స‌ప్త‌తి నిండిన వేళ స‌న్మానం జ‌రుగుతున్న సంద‌ ర్భాన ముగిస్తున్నానొక మార్నింగ్ రాగా..ఈ దిగువ వ్యా ఖ్య‌ల‌తో

బ‌డ్జెట్ నుంచి నీవు ఏం ఆశిస్తున్నావు
ఏం ఆశించ‌ను రోగ నిరోధ‌క‌త పెంచే సాధ‌నాలు
రోగాల‌ను త‌గ్గించే ఆస్ప‌త్రులు కార్పొరేట్ శ‌క్తుల‌ను నియంత్రించే మంత్రులు
రేఖామాత్రంగా కూడా క‌నిపించ‌ని చోట బ‌డ్జెట్ నుంచి ఏం ఆశించి
ఏం చేయాల‌ని?
అర్థంకాని ప‌థ‌కాలు.. కాసుల‌కు క‌క్కుర్తికీ లంకె పెట్టే ప‌థ‌కాలు కేంద్రం ప్ర‌కటిం చ‌దు కానీ రాష్ట్రాల‌ను ఆ దిశ‌గా స‌వ్య దిశ‌గా నియంత్రిం చలేకపోతోంది. ఈ సారి కొన్ని ప్రాయోజిత ప‌థ‌కాలు కేంద్రం నుంచి వ‌స్తే..లేదా ఉన్న‌వాటి గోలను కాస్త‌ యినా ప‌ట్టించుకుంటే ఈ ఆం ధ్ర రా ష్ట్రం..తిరోగ‌మ‌నం నుంచి పురోగ‌మ‌నం వై పు ప‌రుగులంకించుకోగ‌ల‌దు..

తమిళ‌మ్మాయికి ఈ తెలుగింటి అబ్బాయి చేసే విన్న పం ఒక్క‌టే.. ప‌న్నుల వ‌సూలు విదేశీ నిల్వ‌లపై నిఘా త‌ర‌లిపోతున్న సంప‌ద‌ల‌పై నియంత్ర‌ణ లేకుండా మీరు ఎన్ని గార‌డీలు చేసి నా అవ‌న్నీ కాగి తాలకు ఇంపు..మీ మీ పార్ల‌మెంట్ సెష‌న్ల‌కో సొంపు అంతే కానీ అంత‌కుమించి మా జీవితాలు ఏం మార‌వు.. ఏటా మీరు ఇళ్ల ప‌థ‌కాలు, ఏటా మీరు స‌బ్సిడీ ప‌థ‌కాలు ఆ కాలూ ఈ కీలూ విర‌గొడుతూ విర‌గొడుతూ మ‌భ్య పెట్టే సంప్ర‌దా యం ఒక‌టి మారిపోదు కానీ నాలుగు క‌వితా వాక్కుల‌తో మ‌మ్మ‌ల్ని మాత్రం ఊర‌డించ‌కు త‌ల్లీ.. వింటున్నావా ఓయ్ ! తెలుగింటి కోడ‌లా!

ఇప్ప‌టికింతే.. పేద‌రికం ద్ర‌వ్య వినిమ‌యం.. సంబంధిత వాక్కూ, సౌభాగ్యం, సౌ శీల్యం ఇలాంటివి ఎన్న‌డూ ఉండేవే కానీ ఈ ద‌రిద్ర‌గొట్టు కాలంలో మీరు మ‌రి న్ని ఉచిత ప‌థ‌కాలు మాత్రం ప్ర‌క‌ట‌న‌ల రూపేణ వెద‌జ‌ల్ల‌మాకండి. ఎన్నిక‌లున్న రాష్ట్రాల‌కూ ఎన్నిక‌లు లేని ఆంధ్రాకూ ఒకే విధంగా చూడండి.. లేదు లేదు మి మ్మ‌ల్నిఅదిరించి బెదిరించే బెంగాలోడికి ఆ బీహారోడికి మాత్రం సాయం విప‌రీతంగా చేసి మాకు మాత్రం ఎప్ప‌టిలానే ఒక గుడ్డు సున్నా ఇచ్చి ఇదే మీ గుడ్డి జీవితాల‌కు బ‌హుమ‌తి అని మాత్రం చెప్ప‌మాకు త‌ల్లీ.. ఇక ఇప్ప‌టికింతే.. స‌ర్వ రోగ నివారుణులు ఈ బ‌డ్జెట్ లు కావ‌ని,కాబోవ‌ని విన్న‌విస్తూ..

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

Read more RELATED
Recommended to you

Exit mobile version