నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న మెడికల్ షాపులపై చర్యకు సిద్ధం అవుతోంది. ఇకపై ఫార్మాసిస్టులు లేకుండా మెడికల్ షాపులు నడిపితే సీజ్ చేయనుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో డ్రగ్ ఇన్స్పెక్టర్ నెలకు కనీసం 25 ఫార్మసీలను తనిఖీ చేయాలని… నివేదికలను యాప్ ద్వారా డీసీఏ డైరెక్టర్ పంపాలని ఆదేశించింది.
రాష్ట్రంలో చాలా వరకు మెడికల్ షాపులను ఏ అర్హత లేకున్నా… నడిపిస్తున్నారు. చాలా మంది నిర్మాహకులు ఫార్మసీ విద్యార్థుల సర్టిఫికేట్లు కొనుక్కుని మెడికల్ షాపులను నడిపిస్తున్నారు. దీంతో చాలా మెడికల్ షాపులపై నియంత్రణ లేకుండా పోయింది. కనీసం డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్లు లేకుండా మందులను విక్రయిస్తున్నారు. ధరలపై కూడా నియంత్రణ లేకుండా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయంతో అయినా మెడికల్ షాపుల దందాలో మార్పు వస్తుందేమో చూడాలి.