తారలు మాట్లాడడం ఆనందం
నవ్వులు పరమావధి
ఆ నవ్వుల చెంత ఉండడమే పండుగ
గెలిచిన ప్రతిసారీ అమ్మాయిలు మనందరి కన్నా గర్వంగా ఉంటారు.అమ్మాయిలను గెలిపించిన ప్రతిసారీ నాన్నలు మనందరి కన్నా బాధ్యతగా ఉంటారు. అమ్మాయిల వెలుగులు ఈ దేశానికి కావాలి అని రాసిన ప్రతిసారీ ఓ గొప్ప నినాదం అయి ఉంటుంది ఈ మాట.. ఆ వెలుగును ప్రేమిస్తూ ఉదయాలను స్వాగతిస్తూ పోతూ ఉంటే మంచి అన్నది కొంత కాదు ఎంతో నిలిచి ఉంటుంది మనలో! బిడ్డలంతా సంస్కృతిని ప్రేమించాలి.పెరిగే సంస్కృతిలో దేశాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో అన్నది ఓ ప్రాముఖ్యం కావాలి. ప్రాధాన్యం అయి ఉండాలి కూడా! ఆడబిడ్డల కోసం వారి విజయాల కోసం పరితపించే వారు ఇప్పటికీ ఉన్నారు..ఎప్పటికీ ఉంటారు..వారు సాంస్కృతిక వారధులు మాత్రమే కాదు గెలుపునకు సారథ్యం వహించేవారు కూడా!
ముఖ్యమయినవన్నీ మిస్సింగ్ మిస్సింగ్.ఆటలూ పాటలూ వీటితో పాటూ ముఖ్యమైనవన్నీ మిస్సింగ్..జీవితం మైనపు పూతలా ఉంది అని అనుకోవాలి.కరిగి పోతుంది కదా!అందుకే ఆ పూతలు కరిగి ఏదో ఒక ఇబ్బందిని తెరపైకి తెచ్చి ఉంచుతున్నాయి.ఆడ బిడ్డల ఎదుగుదల లేదా వారి చదువు అన్నవి ఇవాళ అందరికీ కావాల్సిన బాధ్యతలు. నిర్వర్తించాల్సిన బాధ్యతలు అని రాయాలి. ఉన్నచోట ఆగిపోవడం లో అర్థం లేదు అని అంటారు కదా! కనుక వాళ్లను ఆ విధంగా ఆగిపోనివ్వని ప్రయాణం ఒకటి ఎవరో ఒకరు తప్పక చేయనివ్వాలి.