ప‌బ్‌జి మొబైల్ గేమ్‌లో చికెన్ డిన్న‌ర్ కొట్టాలా..? ఈ 8 టిప్స్ ఒక‌సారి తెలుసుకోండి..!

-

గేమ్‌లో టీంతో క‌ల‌సి ఆడుతున్న‌ప్పుడు త‌లొక్క దిక్కు వెళ్ల‌కూడ‌దు. అందరూ కలిసే ఉండాలి. ఒక‌రికొక‌రు స‌హ‌కారం అందించుకుంటూ గేమ్‌లో చికెన్ డిన్న‌ర్ కొట్ట‌వ‌చ్చు.

ప‌బ్‌జి మొబైల్‌.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల‌ను వాడుతున్న ఎవ‌రి నోట విన్నా ఇదే గేమ్ వినిపిస్తోంది. అంతగా ఈ గేమ్ పాపుల‌ర్ అయింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం చిన్నారులు, యువ‌త ఈ గేమ్‌కు ఫిదా అయిపోయారు. అయితే ప‌బ్‌జి మొబైల్ గేమ్ ఆడే ఎవ‌రికైనా ల‌క్ష్యం ఒక్క‌టే ఉంటుంది. అది.. గేమ్‌లో ఎలాగైనా స‌రే.. చికెన్ డిన్న‌ర్ కొట్టాల‌ని ఉంటుంది. కానీ కొంద‌రు ఎంత ప్ర‌యత్నించినా చికెన్ డిన్న‌ర్ కొట్ట‌లేక‌పోతుంటారు. అలాంటి వారు కింద ఇచ్చిన ప‌లు టిప్స్ పాటిస్తే ప‌బ్‌జి మొబైల్ గేమ్‌లో చికెన్ డిన్న‌ర్ ఈజీగా కొట్టొచ్చు. మ‌రి ఆ టిప్స్ ఏమిటంటే…

1. ప‌బ్‌జి మొబైల్ గేమ్‌లో ప్ర‌స్తుతం 4 మ్యాప్‌లు ఉన్నాయ‌ని తెలిసిందే. అయితే ఏ మ్యాప్‌లోనైనా స‌రే ల్యాండ్ అవ‌డానికి ముందే మంచి లూట్ దొరికే ప్లేస్ లో దిగ‌డం ముఖ్యం. మంచి గ‌న్స్, త‌గినంత అమ్మొ, మెడిసిన్, డ్రింక్స్‌, గ‌న్స్‌కు స్కోప్స్ ఉంటే గేమ్‌లో సుల‌భంగా ముందుకు వెళ్ల‌వ‌చ్చు. చికెన్ డిన్న‌ర్ కొట్ట‌వ‌చ్చు. అందుక‌ని ఏ మ్యాప్‌లోనైనా స‌రే.. లూట్ బాగా దొరికే ప్లేస్‌కు వెళ్లాలి.

2. గేమ్‌లో కొంద‌రు త‌మ‌కు దొరికిన లూట్ స‌రిపోతుందిలే అని భావించి ఎయిర్‌డ్రాప్స్ జోలికి వెళ్ల‌రు. కానీ అలా చేయ‌రాదు. ఎయ‌ర్ డ్రాప్స్‌ను క‌చ్చితంగా తీసుకోవాలి. వాటిల్లో బెస్ట్ గ‌న్స్‌, ఆర్మ‌ర్ ఉంటుంది. కనుక ఎయిర్ డ్రాప్ క‌నిపిస్తే వెంట‌నే తీసుకుని గేమ్‌లో ముందుకు వెళ్లాలి. బెస్ట్ గ‌న్స్ ఉంటే చికెన్ డిన్న‌ర్ కొట్ట‌డం సుల‌భ‌త‌రం అవుతుంద‌ని గ్రహించాలి. ఆ విధంగా గేమ్‌లో దూసుకెళ్లాలి.

3. గేమ్‌లో టీంతో క‌ల‌సి ఆడుతున్న‌ప్పుడు త‌లొక్క దిక్కు వెళ్ల‌కూడ‌దు. అందరూ కలిసే ఉండాలి. మీకు ఎదుర‌య్యే ప్ర‌త్య‌ర్థులు కూడా టీంగానే ఉంటారు క‌నుక‌.. వారిని కొట్టాలంటే.. మీరు కూడా టీంతో ముందుకు క‌ద‌లాలి. అప్పుడే ఒక‌రికొక‌రు స‌హ‌కారం అందించుకుంటూ గేమ్‌లో చికెన్ డిన్న‌ర్ కొట్ట‌వ‌చ్చు. అలా కాకుండా ఎవ‌రి దారిన వారు వెళ్తే గేమ్ విన్ కాలేరు.

4. కొంద‌రు అవ‌స‌రం లేకున్నా ఎక్కువ అమ్మొ, మెడిసిన్లు, డ్రింక్స్‌ను ద‌గ్గ‌ర పెట్టుకుంటారు. అలా చేయ‌రాదు. గేమ్‌లో మీకు స‌రిపోతాయి అనుకున్నంత పరిమాణంలోనే వాటిని పెట్టుకోవాలి. బ్యాగ్ నిండితే కొన్ని సంద‌ర్భాల్లో ఎయిర్ డ్రాప్ తీసుకునేట‌ప్పుడు లేదా ఎనిమీ క్రేట్‌ల‌ను లూట్ చేసేట‌ప్పుడు ఏ వ‌స్తువులు డ్రాప్ చేయాలో తెలియ‌క క‌న్‌ఫ్యూజ్ అవుతారు. ఈ క్ర‌మంలో ఎక్కువ స‌మ‌యం వృథా అవుతుంది. కొన్ని సంద‌ర్భాల్లో ఎనిమీల‌కు చిక్కే అవ‌కాశం ఉంటుంది. క‌నుక మీకు స‌రిపోతుంది అనుకున్నంత లూట్‌ను మాత్రమే క్యారీ చేయ‌డం ఉత్త‌మం.

5. ఎనిమీలు ఎక్కువ‌గా నివాసాల్లో ఉంటారు క‌నుక ఏ ప్రాంతానికి వెళ్లినా నివాసాల‌పై ఓ క‌న్నేయాలి. దీంతో ఎనిమీల‌ను గుర్తించ‌డం తేలిక‌వుతుంది. అలాగే ఓపెన్‌గా ర‌న్నింగ్ చేస్తున్న‌ప్పుడు కూడా చుట్టూ స్కోప్‌తో చూసుకుంటే ఎనిమీల‌ను గుర్తించ‌వ‌చ్చు.

6. ఎనిమీల‌ను కిల్ చేస్తున్న‌ప్పుడు వీలైనంత వ‌ర‌కు వారికి దొర‌క్కుండా క‌వ‌ర్ చేసుకుని ఆడాలి. ఎనిమీతో పోరాడేట‌ప్పుడు క‌వ‌ర్ చేసుకుని ఆడ‌డం త‌ప్ప‌నిస‌రి. లేదంటే బుల్లెట్ల బారిన ప‌డ‌తారు.

7. మీరు గేమ్ లో ఏప్రాంతంలో ఉన్నా అక్క‌డ గ‌డ్డి ఉంటే.. దానిపై కూడా ఓ లుక్కేయాలి. ఎందుకంటే ఎనిమీలు స్నేక్‌ల రూపంలో గ‌డ్డిలో దాక్కుంటారు. వారిని గుర్తించ‌క‌పోతే గేమ్‌లో కిల్ అయిపోతారు.

8. ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను ఫోన్‌లో లేదా ఎమ్యులేట‌ర్.. దేంట్లో ఆడినా స‌రే.. కంట్రోల్స్ చాలా కీల‌కం. కనుక వాటిపై పూర్తిగా అవ‌గాహ‌న రావాలి. వాటిని వేగంగా ఉప‌యోగించ‌గ‌లిగే టెక్నిక్ తెలియాలి. అలా తెలిస్తే ప‌బ్‌జి గేమ్ లో చికెన్ డిన్న‌ర్ కొట్ట‌డం సుల‌భ‌మే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version