టెన్త్ అర్హతతో 13,075 ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, సంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకో వచ్చు. ఇక పోస్టులు వివరాల లోకి వెళితే..

11,400 మల్టీ-టాస్కింగ్, హవల్దార్ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఈ పోస్టుల కి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 17 ఆఖరి తేదీ. మొత్తం ఖాళీలు 11,400 ఉండగా.. మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (MTS)- 10,880 హవల్దార్ (CBIC & CBN) -529 వున్నాయి.

ఇక అర్హత వివరాల లోకి వెళితే.. అభ్యర్థులు తప్పని సరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్‌ లైన్‌ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలని చూస్తే.. అన్ రిజ్వర్డ్ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వుంది. వయస్సు వివరాల ని చూస్తే..జనవరి 1 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 2023 ఏప్రిల్‌ లో జరగనుంది.

అధికారిక వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

Read more RELATED
Recommended to you

Exit mobile version