జాబ్ కొట్టాలంటే ఇవి పట్టాల్సిందే..! ఓసారి చూసేయండి..

-

ఉద్యోగం రావలంటే..మనకు మంచి మార్కులు ఉంటే చాలు అనుకుంటారు చాలామంది. అసలు ఇంటర్వూలో మీ మార్కులు హెచ్ఆర్ ఇచ్చే ప్రాధాన్యం ఎంతో మీరెప్పుడైనా గమనించారా.. వాళ్లు ఆ క్షణం అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సరైన జవాబు ఉందా లేదా అదే కదా వాళ్లు చూసేది. అకడమిక్ ట్రాక్ రికార్డు ఉంటే.. జాబ్ కొట్టేయొచ్చు అనేది భ్రమే. తెలివితేటలు, ప్రతిభతో పాటు కష్టపడి పనిచేసే తత్వం, చురుగ్గా ఆలోచించే సామర్థ్యం, చొరవ, బాధ్యతలు తీసుకోవడం… లాంటి ఎన్నో అంశాలు ఉద్యోగం సాధించే విషయంలో ప్రభావితం అవుతాయి. ఈరోజు ఉద్యోగానికి అవసరమైన లక్షణాలన్నీ చూద్దాం.
సాధారణ పరిమితులకు మించి భిన్నంగా, సృజనాత్మకంగా ఆలోచించడాన్ని అలవాటు చేసుకోవాలి.
సంబంధిత రంగంలో వస్తున్న మార్పులు, కొత్త పోకడలపై అవగాహన ఉంచుకోవాలి. వాటిని పనికి ఎలా అన్వయించవచ్చో ఆలోచించే నేర్పరితనం కూడా ఉండాలి.
ఇతరులతో చక్కగా మాట్లాడగలగాలి. ఉద్యోగంలో సహచరులతో కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్లడం చాలా అవసరం.
భావవ్యక్తీకరణ శక్తి కూడా మెండుగా ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి.. ఇవన్నీ తెలిసి ఉండాలి. ఈ ఎటికెట్స్ తెలియని వాళ్లకి ఉద్యోగం పొందే అవకాశాలు చాలా తక్కువ అని నిపుణులు అంటున్నారు.
చక్కని దార్శనికత, చొరవ తప్పనిసరి.
లోకజ్ఞానంతోపాటు తగినంత సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉండాలి.
నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తి ఉండాలి.
పనిచేయాలనుకున్న సంస్థపై అవగాహన, సదభిప్రాయం తప్పనిసరిగా ఉండాలి. మనం ఏదైనా కంపెనీకి ఇంటర్వూ అటెండ్ అవుతున్నామంటే.. ఆ కంపెనీ ఎప్పుడు ఫామ్ అయింది, సీఈఓ, కో ఫౌండర్స్ ఎవరూ, కంపెనీ లక్ష్యం ఏంటి, మార్కెట్ లో కంపెనీ షేర్ ప్రైస్ ఎలా ఉంది, లాభాలు వస్తున్నాయా, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఎంప్లాయిస్ స్ట్రెంథ్ ఎంత ఇలాంటి కనీస సమాచారం మొత్తం తెలుసుకోవాలి.
సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. నిరాశావాదం ఏమాత్రం పనికిరాదు. ఇది కాకపోతో ఇంకోటి అనే వేలో ఉండాలి మన థాట్ ప్రాసెస్.
కొత్త అంశాలు నేర్చుకోవడానికి, కొత్త టెక్నాలజీతో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
ఒత్తిడిలోనూ పనిచేయగలిగే సామర్థ్యం పెంపొందించుకోవాలి.
ఉద్వేగాలను అదుపులో పెట్టుకోగలగాలి.
 వాయిదా వేసే తత్వం ఏ మాత్రం పనికిరాదు. బద్ధకాన్ని జయించాలి.
అందరూ మెచ్చుకోగలిగే వ్యవహారశైలిని అలవాటు చేసుకోవాలి. అంటే మంచి టీమ్ ప్లేయర్‌గా ఉండాలి. దీనికోసం పారదర్శకంగా ఉంటూ, తోటి ఉద్యోగులకు పనిలో వీలైనంత సాయం చేయగలగాలి. అలా అని ఒళ్లుహూనం చేసుకోకూడదు. మనం అన్ని చోట్ల ఉన్నట్లే ఉండాలి.. కానీ మనం వర్క్ ను మాత్రం పక్కన పెట్టకూడదు.
ఉద్యోగం రావాలంటే..ఎప్పుడో ఇంటర్లో, డిగ్రీల్లో చదివింది కాదు.. ఇప్పుడు ఈరోజు.. సొసైటి ఎలా ఉంది, టెక్నాలజీ ఎలా అప్డేట్ అవుతుంది. మార్కెట్ లోకి కొత్తగా ఏం ఏం వస్తున్నాయి, రాజకీయ, సాంకేతిక పరిజ్ఞానంతో అవలంబించుకోవాలి.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version