డిగ్రీ చేసిన వారికి గుడ్ న్యూస్..నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లో ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఉద్యోగాలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ పోస్టులని భర్తీ చేస్తోంది. దీనిలో మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ పోస్టులకి అప్లై చెయ్యడానికి డిసెంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, రీజినల్ మేనేజర్ పోస్టులని భర్తీ చేస్తోంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల గురించి చూస్తే… SC/ST/PwBD అభ్యర్థులకు 55 శాతం మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు.

CA చేసిన వారు కూడా అప్లై చెయ్యచ్చు. 60 శాతం మార్కులతో డిగ్రీ విద్యార్హత సాధించిన అభ్యర్థులు అప్లై చెయ్యచ్చు. అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులు మార్క్ షీట్ ను సబ్మిట్ చెయ్యాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇక డిప్యూటీ మేనేజర్ పోస్టుల వివరాల లోకి వెళితే.. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇనిస్ట్యూట్స్ లో రెండేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. ఎంబీఏ ఫైనాన్స్ చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. రీజినల్ మేనేజర్ పోస్టులకైతే డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. కార్పొరేట్ క్రెడిట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ లో రెండేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. www.nhb.org.in ను ఓపెన్ చేసి అప్లై చేసుకోచ్చు. అభ్యర్థులు రూ. 850ని అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/PwBD అభ్యర్థులకు రూ. 175ని అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version