కేటీఆర్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ వేయనున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీకి డైరెక్షన్స్ ఇవ్వాలని కోరుకున్నారు కేటీఆర్. ఇక మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు న్యాయవాది సమక్షంలో విచారణ జరపడానికి నిరాకరించారు ఏసీబీ.
ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కేటీఆర్. ఈ నెల 9న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఏసీబీ, ఈడీ నోటీసులకు వ్యక్తిగతంగా హాజరై విచారణకు సహకరిస్తానంటున్న కేటీఆర్.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.