చంద్రబాబు నాయుడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గోకులాల ప్రారంభానికి చంద్రబాబు నాయుడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జనవరి 10, 11 మరియు 12వ తేదీలలో గోకులాల ప్రారంభానికి చంద్రబాబు నాయుడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ప్రకటన చేసింది.
ఇది ఇలా ఉండగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో 2లక్షల 8వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో అనకాపల్లి జిల్లా, పూడిమడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కీలకమైంది. రెండు దశల్లో లక్ష 85 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. రోజుకు 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ తో పాటు అమ్మోనియా, మెథనాల్, సస్టెయిన్బుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఉత్పత్తి జరుగుతుంది. దీని ద్వారా 25 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో దేశీయంగా ఈ ప్రాజెక్టు చాలా కీలకమైంది.