ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుంటుంది. వయసు మీద పడిన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వారికి రాసిచ్చిన ఆస్తులు వెనక్కి తీసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు సబ్ రిజిస్టార్లకు… చంద్రబాబు కూటమి సర్కార్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
2007 సీనియర్ సిటిజన్లో చట్టం ప్రకారం తమను పిల్లలు సరిగా చూసుకోవడం లేదని…. తల్లిదండ్రులు ట్రిబ్యునల్ అధికారిగా ఉండే ఆర్డీవో కు ఫిర్యాదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. విచారణలో నిజమని తేలితే ఆర్డివో ఇచ్చే ఆదేశాల ఆధారంగా సభ రిజిస్టర్లు ఆస్తి డాక్యుమెంట్లను రద్దు చేస్తారు. దీంతో తిరిగి ఆ తల్లిదండ్రులకు పేరు పైకి ఆస్తులు వెళ్తాయి.