ఆర్ధిక సమస్యల వలన చాలా మంది విద్యార్థులు చదువుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వికలాంగులు ఉన్నత విద్యని పొందలేకపోతున్నారు. అలంటి వాళ్లకి సహకారం అందించేందుకు దేశంలోని అనేక ప్రతిష్టాత్మక సంస్థలు స్కాలర్షిప్లను అందిస్తున్నాయి. అయితే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ఆర్ధిక సహాయాన్ని ఇస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే….
తాజాగా ఈ సంస్థ సాక్షం స్కాలర్షిప్ల దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అయితే 2021-22 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులను అభ్యసించే వికలాంగులు వీటికి దరఖాస్తు చేసుకోచ్చు. ఈ సాక్షం స్కాలర్షిప్ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది.
ఇక ఎవరు అప్లై చెయ్యచ్చు అనేది చూస్తే.. ఏఐసీటీఈ ఆమోదించిన సంస్థల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ ఫస్టియర్ లేదా లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి అప్లై చెయ్యచ్చు. ప్రతి సంవత్సరం రూ.50,000 స్టైఫండ్ ని ఇస్తారు. ఇంజినీరింగ్ పూర్తయ్యే నాలుగేళ్ల పాటు ఈ స్కాలర్షిప్ను అందిస్తుంది.
40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి గమనించండి. అలానే దరఖాస్తు చేసుకునే విద్యార్థి కుటుంబ వార్హిక ఆదాయం రూ. 8 లక్షలకు మించకూడదు. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ముందుగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP)లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు 2021 నవంబర్ 30లోపు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలని https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction లో చూడచ్చు.
విజయపథంతో విజయకేతనం..
అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే ప్రాక్టీస్ బిట్స్, ఆన్ లైన్ ఎక్జామ్స్ జనరల్ నాలెడ్జ్, భారతదేశ సంస్కృతి, ఇండియన్ పాలిటి, తెలంగాణ జియోగ్రఫీ, అంతర్జాతీయ సంబంధాలు, తెలంగాణ సైన్స్, ఇండియన్ జియోగ్రఫీ, కరెంట్ ఆఫైర్స్, వరల్డ్ జాగ్రఫీ, విపత్తులు నిర్వహణ, తెలంగాణ సామాజిక సంస్కృతిక చరిత్ర ఇలా అన్నీ భాగాల్లో A-Z సమాచారంఅందించేందుకు మేము చేసే ప్రయత్నం.. విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ . vijayapatham.com