సరోగసి కోసం పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. దింతో అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తు పై నుండి దూకి చనిపోయింది మహిళ. హైదరాబాద్ – మై హోమ్ భుజ అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తు పై నుండి దూకి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్ (25) అనే మహిళ…మరణించింది.
సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం అశ్విత సింగను తెచ్చుకున్నాడు రాజేష్ బాబు అనే వ్యక్తి.పిల్లలను కనివ్వడం కోసం పది లక్షల డీల్‌ను మాట్లాడుకున్నాడు రాజేష్ బాబు..
గత కొన్నాళ్లుగా అశ్వితను లైంగికంగా వేధిస్తున్న రాజేష్ బాబు.. అతని ప్రవర్తన నచ్చకపోవడంతో పారిపోవడానికి ప్రయత్నించింది అశ్విత సింగ్. ఇక తప్పించుకునే క్రమంలో అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తు పై నుండి దూకి చనిపోయింది అశ్విత సింగ్.
అశ్విత సింగ్‌కు భర్త మరియు నాలుగు సంవత్సరాలలో బాబు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు..రాజేష్ బాబు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.