కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ హాజరయ్యారు. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ సమర్పించారు. అవసరమైన పరీక్షలు పూర్తి చేసి రాష్ట్ర సర్కార్ వివరాలను అందించకపోవడం వల్లనే కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన NDSA నిపుణుల కమిటీ నివేదిక ఆలస్యం అవుతుందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ వెల్లడించారు.
కాళేశ్వరం కమిషన్ ముందు అఫిడవిట్ దాఖలు చేశాను. నా దగ్గర ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేశారు. NDSA రిపోర్టు అంశాన్ని కమిషన్ చీఫ్ నాతో మాట్లాడారు. ప్రాజెక్టులో గుంతలను రాష్ట్ర ఇంజినీర్స్ పూడ్చడంతో జియో టెక్నికల్, జియోగిజికల్ డేటా కోల్పోయామని తెలిపారు. జియో ఫిజికల్ టెస్ట్ ల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు వివరాలను అడిగితే అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. NDSA అడిగిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లనే NDSA నివేదిక ఆలస్యం అవుతుందని వెదిరే శ్రీరామ్ పేర్కొన్నారు.