నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ CIPET సంస్థలో ఉద్యోగాల భర్తీ!

-

నిరుద్యోగులకు సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అం డ్‌ టెక్నాలజీ (CIPET)ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్‌ సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం. కరోనా నేపథ్యంలో ఇప్పటికే నియామకాలు ఆగిపోయాయి. తాజాగా వీటి భర్తీకి శ్రీకారం చుట్టింది. టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సూచించిన ఫార్మాట్లో Sr. Officer (Admin./HR), CIPET Head Office, T.V.K. Industrial Estate, Guindy, Chennai & 600 032 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి జులై 30 ఆఖరి తేదీగా నిర్ణయించారు.

CIPET

ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

టెక్నికల్‌ విభాగంలో ఐదు ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. చీఫ్‌ మేనేజర్‌ (టెక్నికల్‌/అసోసియేట్‌ ప్రొఫెసర్‌) పోస్టులు ఇందులో ఉన్నాయి. పోస్టుల వారీగా చీఫ్‌ మేనేజర్‌(పర్సనల్‌ – అడ్మినిస్ట్రేషన్‌), చీఫ్‌ మేనేజర్‌(ఫైనా న్స్‌– అకౌంట్స్‌) 1, మేనేజర్‌ (పర్సనల్‌ – అడ్మినిస్ట్రేషన్‌) 1 ఖాళీ ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు 45 ఏళ్ల వయోపరిమితిగా నిర్ణయించారు. ఇతర వివరాల కోసం అభ్యర్థులు నోటిఫికేషన్లో చూడొచ్చు. మరో విధంగా వరుస లాక్‌డౌన్ ల నేపథ్యంలో చిల్డ్ర న్ ఎడ్యుకేషన్  అలవెన్స్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదికి అలవెన్స్‌ క్లైమ్‌ కోసం వ్యక్తిగత సర్టిఫికేషన్ కు అనుమతించాలని నిర్ణయించింది. దీని వల్ల 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version