గుడ్ న్యూస్.. ఎన్‌ఐఎల్‌డీలో ఉద్యోగాలు… పూర్తి వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటర్‌ డిజేబిలిటీస్‌ పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. కనుక ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటర్‌ డిజేబిలిటీస్‌ దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.

కాంట్రాక్ట్‌ విధానంలో వీటిని భర్తీ చేస్తున్నారు. ఐతే దీనిలో మొత్తం 13 ఖాళీలు వున్నాయి. దీనిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్, డైరెక్టర్, క్లినికల్‌ అసిస్టెంట్, క్లినికల్‌ సైకాలజిస్ట్, ఓరియెంటేషన్‌ అండ్‌ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్, లెక్చరర్‌ వంటి పోస్టులు వున్నాయి.

ఇక ఖాళీల వివరాల లోకి వెళితే.. త్రిపుర–05, పాట్నా–04, ఐజ్వాల్‌–02, డెహ్రాడూన్‌–02 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల ఖాళీలు చూస్తే.. పీఎం–ఆర్, క్లినికల్‌ సైకాలజీ, ఎంఆర్, హెచ్‌ఐ ఈ1 యూనిట్‌ పట్నా, స్పీచ్‌–హియరింగ్‌ విభాగాల్లో ఇలా ఖాళీలున్నాయి. అప్లై చేసుకోవాలంటే వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్, బీఆర్‌ఎస్‌/తత్సమాన, బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంఏ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/డిప్లొమా, ఎంఫిల్, ఎండీ/ఎంఎస్‌ ప్యాస్ అవ్వాలి. పైగా ఏడాది పాటు అనుభవం కూడా తప్పని సరిగా ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చెయ్యాలంటే ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెలకు రూ.25,000 నుంచి రూ.80,000 వరకు శాలరీ ఉంటుంది. రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు ఆఖరి తేదీ 11-03-2022.

దరఖాస్తులను పంపాల్సిన చిరునామా:

డైరెక్టర్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటార్‌ డిజెబిలిటీస్‌(దివ్యాంగ్‌జన్‌), బి.టి.రోడ్, బాన్‌–హుగ్లీ, కోల్‌కతా–700090.

Read more RELATED
Recommended to you

Exit mobile version