HAL: నిరుద్యోగులకు గుడ్ న్యూస్… 475 ఖాళీలు…!

-

నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు అప్లై చెయ్యొచ్చు. ఈ నోటిఫికేషన్ ‌లో భాగంగా నాసిక్ డివిజన్‌ లో పలు అంప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2021-22 ఏడాదికి గాను విడుదల చేసిన ఈ నొటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలని ఇక్కడ చూడొచ్చు.

మరిన్ని వివరాల కోసం hal india.co.in లో చూడొచ్చు. నోటిఫికేషన్ లో వున్న సమాచారం ప్రకారం మొత్తం 475 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆసక్తికలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ లో తమ అప్లికేషన్‌ను సబ్మిట్ చెయ్యాలి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రెంటీస్ ట్రైనీలుగా పని చెయ్యాలి. అప్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ఉపకార వేతనం చెల్లించనున్నారు.

ఇక పోస్టుల వివరాల లోకి వస్తే… ఫిట్టర్ 210, టర్నర్ 28, మిషనిస్ట్ 26, కార్పేంటర్ 03,
ఎలక్ట్రిషియన్ 78, డ్రాఫ్ట్స్ మ్యాన్ (మెకానికల్)-08, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 08, పెయింటర్ (జనరల్) 08, షీట్ మెటల్ వర్కర్ 04, మెకానిక్ 04, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 77,
వెల్డర్ 10, స్టెనో గ్రాఫర్ 08.

ముందుగా అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా www.apprenticeshipindia.org లో రిజిస్టర్ చేసుకోవాలి. నెక్ట్స్ అప్లికేషన్ ఫామ్‌లో ఉన్న డీటెయిల్స్ ని ఫిల్ చేసి సబ్మిట్ చెయ్యాలి. అప్లికేషన్ విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థికి ఒక మెయిల్ వస్తుంది. అక్‌నాలెడ్జ్‌మెంట్ కాపీనీ ప్రింట్ తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news