హైదరాబాద్ నగర ప్రజలకు బిగ్ అలర్ట్. మార్చి 8వ తేదీన నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. హైదరాబాద్ లో మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు ప్రకటించారు.

అంటే ఎస్ ఆర్ నగర్, ఎర్రగడ్డ, హెచ్బి కాలనీ, మూసాపేట, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, అశోక్ నగర్, అర్ సి పురం, లింగంపల్లి, చందానగర్, మదినగూడ, మియాపూర్, గంగారం, జ్యోతి నగర్, బిరంగూడ, శ్రీనగర్, అమీన్పూర్, నిజాంపేటలో… మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డ్ (HMWSSB) బుధవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో BHEL జంక్షన్ సమీపంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫ్లైఓవర్ నిర్మించబోతున్నట్లు వినియోగదారులకు తెలియజేసింది.
ఈ నేపథ్యంలో ఈ పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అభ్యర్థన మేరకు అక్కడ ప్రస్తుతం ఉన్న పీఎస్సీ నీటి సరఫరా పైప్‌లైన్‌ను వేరే చోటికి మార్చనున్నారు. అందుకే మార్చి 8వ తేదీన నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది.