ఐడీబీఐ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2021… 134 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్..

-

ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ దేశ‌వ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ బ్యాంక్ బ్రాంచ్‌ల‌లో ప‌నిచేసేందుకు గాను స్పెషలిస్ట్ క్యాడ‌ర్ ఆఫీస‌ర్స్ పోస్ట్‌ల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో భాగంగా మొత్తం 134 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు 2021 జ‌న‌వ‌రి 7వ తేదీలోగా ఆయా పోస్టుల‌కుగాను ఆన్‌లైన్‌లో అప్లికేష‌న్లు పెట్టుకోవాల్సి ఉంటుంది.

ముఖ్య‌మైన తేదీలు:

అప్లికేష‌న్ ఫాంల‌ను ఆన్‌లైన్‌లో స‌బ్‌మిట్ చేసేందుకు ప్ర‌క్రియ ప్రారంభం అయ్యే తేదీ: డిసెంబ‌ర్ 24, 2020
అప్లికేష‌న్ ఫాంల‌ను స‌బ్‌మిట్ చేసేందుకు చివ‌రి తేదీ: 7 జ‌న‌వ‌రి 2021

విభాగాల వారీగా ఖాళీగా ఉన్న స్పెష‌లిస్ట్‌ క్యాడ‌ర్ ఆఫీస‌ర్ల పోస్టుల వివ‌రాలు…

* డీజీఎం – గ్రేడ్ డి – 11 పోస్టులు
* ఏజీఎం – గ్రేడ్ సి – 52 పోస్టులు
* మేనేజ‌ర్ – గ్రేడ్ బి – 62 పోస్టులు
* అసిస్టెంట్ మేనేజ‌ర్ – గ్రేడ్ ఎ – 9 పోస్టులు

అర్హ‌త‌లు…

* గ్రేడ్ డి డీజీఎం పోస్టుకు అప్లై చేసేవారికి గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీలో క‌నీసం 55 శాతం మార్కులు వ‌చ్చి ఉండాలి. వ‌య‌స్సు క‌నీసం 25 సంవ‌త్స‌రాలు, గ‌రిష్టంగా 35 ఏళ్లు ఉండ‌వ‌చ్చు.
* గ్రేడ్ సి ఏజీం పోస్టుకు గాను ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలిక‌మ్యూనికేష‌న్స్ లేదా కంప్యూట‌ర్ సైన్స్ లేదా ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఎల‌క్ట్రిక‌ల్ లేదా ఐటీ, ఈసీఈలో బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీల‌ నుంచి డిగ్రీ, ఎంసీఏ చేసి ఉండాలి. వ‌య‌స్సు క‌నీసం 28 ఏళ్లు, గ‌రిష్టంగా 40 ఏళ్లు ఉండ‌వ‌చ్చు.
* గ్రేడ్ బి మేనేజ‌ర్ పోస్టుకు పైన తెలిపిన ఏజీఎం పోస్టు అర్హ‌త‌లు ఉండాలి. వ‌య‌స్సు మాత్రం క‌నీసం 35 ఏళ్లు, గ‌రిష్టంగా 45 ఏళ్లు ఉండ‌వ‌చ్చు.
* గ్రేడ్ ఎ అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ చేసి ఉండాలి. ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ లేదా సైబ‌ర్ క్రైమ్ రిలేటెడ్ క్వాలిఫికేష‌న్‌ను క‌లిగి ఉన్న వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. వ‌య‌స్సు క‌నీసం 21 ఏళ్లు, గ‌రిష్టంగా 28 ఏళ్లు ఉండ‌వ‌చ్చు.

ఇక అభ్య‌ర్థులు www.idbibank.in అనే వెబ్‌సైట్‌లో కెరీర్స్ అనే విభాగంలో ఉండే క‌రెంట్ ఓపెనింగ్స్ సెక్ష‌న్‌కు వెళ్లి ఈ నోటిఫికేష‌న్‌కు చెందిన పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. అదే సైట్‌లో పైన తెలిపిన పోస్టుల‌కు అప్లై చేయ‌వచ్చు. ఇత‌ర ఏ మాధ్య‌మంలో అప్లై చేసినా స‌ద‌రు అప్లికేష‌న్ల‌ను స్వీక‌రించ‌రు.

Read more RELATED
Recommended to you

Exit mobile version