నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణాలో మళ్ళీ ఉద్యోగాలు

-

తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తున్న సంగతి తెలిసింది.ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తెలంగాణాలో ఇటీవల గ్రూప్ వన్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. అంతకు ముందు పోలీస్‌ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రెండు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. అవేంటో ఒకసారి చుద్దాము.. పోలీసు రవాణా విభాగం, ఎక్సైజ్‌ శాఖలో కలిపి 677 కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోలీసు నియామక మండలి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో ఎక్సైజ్‌ శాఖలో 614 పోస్టులు ఉన్నాయి.

jobs

పోలీసు రవాణా విభాగంలో 63 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. ఈ  పోస్టులకు మే 2వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుంటారు. ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
కాగా, పోలీసు శాఖతో పాటు ఎస్పీఎఫ్‌, అగ్నిమాపక, జైళ్ల శాఖలో 16,614 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ నాలుగు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు www.tslprb.in వెబ్‌సైట్‌ లో పూర్తిగా తెలుసుకోవచ్చు..అలాగే అప్లై చేసుకోవచ్చు. మే 2 నుంచి 20వ చివరి తేదీ ఆసక్తి కలిగిన వాళ్లు వెబ్ సైట్ ను ఓపెన్ చేసి నోటిఫికేషన్ ను పూర్తీగా చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version