ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల మృదువైన పరుపులు మార్కెట్ లో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే సరైన ఎంపిక చేసుకోకపోవడం వలన వెన్ను నొప్పి వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. దీంతో నిద్ర పై కూడా ఎంతో ప్రభావం ఉంటుంది. కొన్ని రకాల పరుపులు ఎంతో మెత్తగా మరియు సౌకర్యంగా ఉన్నా సరే నేలపై నిద్రించడం వలన ఎన్నో ఉపయోగాలను పొందవచ్చు. ఎప్పుడైతే నేలపై పడుకుంటారో శరీరం ఎంతో సహజమైన స్థితిలో విశ్రాంతి తీసుకుంటుంది. నేలపై పడుకున్నప్పుడు వెన్నెముక సరైన విధంగా ఉంటుంది.
అదేవిధంగా అసౌకర్యం ఏర్పడడం వలన వెన్నెముక నొప్పితో పాటుగా భుజాల నొప్పి, ఎముకలు మరియు కీళ్ల పై ఒత్తిడి పడడం వంటివి జరుగుతాయి. పైగా నిపుణులు ప్రకారం ఎవరికైతే వెన్ను నొప్పి సమస్య ఉంటుందో వారు నేలపై పడుకోవడం వలన సమస్య తీవ్రత తగ్గుతుందని చెబుతున్నారు. కాకపోతే కీళ్ల సమస్యలు, ఆర్థరైటిస్ వంటి మొదలైన దీర్ఘకాలిక ఇబ్బందులతో బాధపడుతుంటే నేలపై పడుకోవడం వలన మరింత ఇబ్బంది ఏర్పడుతుంది. వృద్ధులు లేక గర్భిణీ స్త్రీలు తప్పకుండా పరుపును ఉపయోగించాలి.
అలాంటి వారు మృదువైన పరుపును ఉపయోగించడం వలన కీళ్ల పై ఒత్తిడి తగ్గుతుంది మరియు ఎంతో సులువుగా నిద్ర వస్తుంది. ఎప్పుడైతే రెండు వారాల పాటుగా నేల పై పడుకోవడాన్ని అలవాటు చేసుకుంటారో శారీరకంగా ఎన్నో మార్పులు జరుగుతాయి. వెన్నెముక భాగంలో ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. దీంతో వెన్నెముక నిటారుగా ఉండడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా మంచి నిద్రను కూడా పొందవచ్చు. ఈ విధంగా నేలపై పడుకోవడం వలన నిద్ర నాణ్యత పెరుగుతుంది మరియు ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి కింద పడుకోవడం కష్టం కనుక మీ ఆరోగ్య పరిస్థితి ప్రకారం నిద్రపోవడం మేలు.