అమెజాన్ లో ఉద్యోగాలు… ఇలా అప్లై చెయ్యండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. అమెజాన్ వర్క్ ఫ్రం హోం జాబ్స్ ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. సెల్లర్ సపోర్టు అసోసియేట్ పోస్టులను అమెజాన్ భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి ఏదైన డిగ్రీ చేసి ఉండాలి.

 

అలానే ఇంగ్లీష్ లో మంచి భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 24/7 షిఫ్ట్ లు పని చేసేందుకు రెడీగా ఉండాలి కూడా. వర్క్ ఫ్రం హోంకు అవసరమైన ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా అవసరం. అదే విధంగా ఉద్యోగి హైదరాబాద్ లో సంస్థకు అందుబాటులో ఉండాలి. ఆన్లైన్ లోనే ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే ఎంపిక అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగికి వర్క్ ఫ్రం హోం చేసే అవకాశం ఇచ్చింది అమెజాన్. శాలరీ వచ్చేసి సంవత్సరానికి రూ. 2,75,000 నుంచి రూ.4,00,000 ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారి వెబ్ సైట్ https://www.amazon.jobs/en సందర్శించవచ్చు.

అప్లై చేసుకోవాలంటే ముందుగా అభ్యర్థి అధికారిక వెబ్ సైట్ https://amazonvirtualhiring.hirepro.in ను ఓపెన్ చెయ్యాలి. నెక్స్ట్ మీ వివరాల్ని ఇవ్వాలి. ఆన్లైన్ పరీక్ష కి సంబంధించి మెయిల్ వస్తుంది. ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాలి. రెండు, మూడు రౌండ్ల ఇంటర్వ్యూ చేసాక ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థి ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version