తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో ఉద్యోగాలు.. వివరాలివే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్ కార్యాలయం, హైదరాబాద్ పోస్టల్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

indian post

ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎల్డీసీ, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్/మెయిల్ గార్డ్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అప్లై చేసేందుకు సెప్టెంబర్ 24ను ఆఖరి తేదీ. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక పోస్టుల వివరాలని చూస్తే.. మొత్తం పోస్టులు 55, పోస్టల్‌ అసిస్టెంట్‌ 11, సార్టింగ్‌ అసిస్టెంట్‌ 08, పోస్ట్‌మ్యాన్‌/ మెయిల్‌ గార్డ్ 26, ఎంటీఎస్‌ 10.

పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్ పోస్టుకి అయితే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి తప్పని సరిగా 12 వ తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. పోస్ట్ మ్యాన్ పోస్టులకి 12వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. తప్పని సరిగా స్థానిక భాష్ (తెలుగు) వచ్చి ఉండాలి. కనీసం టెన్త్ వరకు టెన్త్ సబ్జెక్టుగా కలిగి ఉండాలి.

ఉద్యోగం పొందిన రెండేళ్లలోగా టూ వీలర్ లేదా లైట్ మోటార్ వెహికిల్, త్రీ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి. అదే MTS కి అయితే టెన్త్ పాసై లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు టెన్త్ వరకు తెలుగును ఓ సబ్జెక్టును కలిగి ఉండాలి. అలానే సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అభ్యర్థుల ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలని https://tsposts.in/sportsrecruitment/ లో చూడచ్చు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version