నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్​ కోల్​ఫీల్డ్​ లిమిటెడ్​లో ఖాళీలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ కోల్ ఫీల్డ్ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం 539 అప్రెంటీస్ పోస్టులు వున్నాయి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కోపా, మెషినిస్ట్, టర్నర్, ప్లంబర్, సిర్దార్ మొదలైనఅప్రెంటీస్ వంటి ఖాళీలు వున్నాయి.

jobs

ఎంపికైన అభ్యర్థులను జార్ఖండ్‌లోని రాంచీ సెంట్రల్​ కోల్​ఫీల్డ్​ లిమిటెడ్​ (సీసీఎల్​)లో పని చెయ్యాల్సి ఉంటుంది. సీసీఎల్​ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సిర్ధార్ పోస్టుకు దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అలానే అభ్యర్థులంతా సంబంధిత ట్రేడ్​ విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ చేసి ఉండాలి. ఇక వయస్సు విషయంలోకి వస్తే.. నవంబర్ 20 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

సెంట్రల్​ కోల్​ ఫీల్డ్​ లిమిటెడ్ అప్రెంటీస్ పోస్టుకు ఎంపికైతే ప్రతినెలా రూ. 7000 స్టైపెండ్​ వస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు www.apprenticeshipindia.org వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చెయ్యాలి. దరఖాస్తుకు డిసెంబర్ 5ను ఆఖరి తేదీ. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version