యూపీఎస్సీ మరో నోటిఫికేషన్‌ .. ఇలా అప్లై చేయండి!

-

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మరో నోటిఫికేషన్‌ ( యూపీఎస్సీ నోటిఫికేషన్‌ | UPSC Notification )ను విడుదల చేసింది. ఈ రెండో సెషన్‌ ఎగ్జామ్‌ ద్వారా ఇండియన్‌ నావల్‌, మెరైన్‌, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాల్లో ఆఫీసర్‌ లెవల్‌ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24తో ముగియనుంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను 2021 నవంబర్‌ 14న నిర్వహించనున్నారు.
దరఖాస్తు చేసే అవివాహిత పురుషులు 1998 జూలై 2– 2003 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీకి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 2022 జూలై 1 నాటికి 20 – 24 ఏళ్ల మధ్య ఉండాలి.

యూపీఎస్సీ నోటిఫికేషన్‌ | UPSC Notification

అయితే, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్‌ పైలట్‌ లైసెన్‌ కలిగి ఉన్న అభ్యర్థులకు 2 ఏళ్ల సడలింపు ఉంటుంది. అంటే ఈ అభ్యర్థులు 1996 జూలై 2 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. దీనికి గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి. ఇండియన్‌ నావల్‌ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌ పూర్తి చేసిన వారు అర్హులు. ఎయిర్‌ ఫోర్స్‌ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ (10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌) లేదా బీఈ/బీటెక్‌ పూర్తి చేయాలి. ఫైనలియర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

కానీ, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ సమయానికి గ్రాడ్యుయేషన్‌/ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ http://www.upsconline.nic.in ద్వారా ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి.

తెలంగాణ వైద్య విభాగంలో ఉద్యోగాలు!

అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరిక!

Read more RELATED
Recommended to you

Exit mobile version