నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్​లో ఒకేషనల్​ కోర్సులు..!

-

మీరు ఓపెన్ డిగ్రీ విధానంలో ఏదైనా వృత్తి విద్యా కోర్సు చెయ్యాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఓపెన్​ స్కూలింగ్ D.El.Ed కోర్సులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. 2021 ఏడాదికి సంబంధించి దరఖాస్తు చేస్తోంది.’

 

ఆసక్తి ఉంటే అక్టోబర్​-నవంబర్​ సెషన్​ పరీక్షల కోసం నవంబర్​ 20లోపు దరఖాస్తు చేసుకోవాలి. రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్​ 25 వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం వుంది. రూ. 1500 ఆలస్య రుసుము చెల్లించి నవంబర్​ 30 వరకు దరఖాస్తు చేసుకోచ్చు.

2021 డిసెంబర్‌లో లేదా 2022 జనవరిలో పరీక్షలని నిర్వహిస్తారు. వర్చువల్​ లైవ్​ క్లాస్​ రూమ్​లు, వర్చువల్​ ల్యాబ్​ ద్వారా విద్యా బోధన ఉంటుందని తెలిపింది. NIOS కోర్సుల కోసం అభ్యర్థులు www.nios.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను చూడచ్చు.

ముందుగా వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.
హోమ్‌పేజీలో, ‘‘రిజిస్ట్రేషన్​ ఫర్​ ఒకేషనల్, D.El.Ed కోర్సులు’ అనే లింక్ ఉంటుంది. దానిని ఓపెన్ చెయ్యాలి.
ఇక్కడ ఈ–మెయిల్ ఐడి, పాస్‌వర్డ్ తో అకౌంట్​ క్రియేట్​ చేసుకోండి.
ఆపై మీ అకౌంట్​లోకి లాగిన్ అవ్వండి.
కోర్సుని సెలెక్ట్ చేసుకోండి.
డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
ఆ తర్వాత ఫీజు చెల్లించండి అంతే.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version