ఈ ఉద్యోగాల్లో పని తక్కువ..జీతం మాత్రం లక్షల్లో

-

ఉద్యోగాల్లో : ఈరోజుల్లో కష్టపడితే కానీ పైసల్‌ రావు.. జీతం తక్కువ..పనిభారం ఎక్కువ.. ఏ జాబ్‌లో అయినా ఇంతే ఉంటుంది. ఇచ్చే జీతం కంటే.. చేయించుకునే పనే ఎక్కువగా ఉంటుంది.. ఎమన్నా అంటే.. మీకు పైసల్‌ ఇచ్చేది పని చేయించుకోవడానికే కదా..! ఖాళీగా కుర్చోబెట్టి జీతం ఎవ్వరూ ఇవ్వరూ అంటారు.. కానీ కొన్ని కంపెనీలు ఏ పని చేయకుండానే లక్షల్లో జీతం ఇస్తున్నాయి.. ఆశ్చర్యంగా ఉంది కదూ..! పని లేకుండా జీతం పొందడం ఎవరికి ఇష్టం ఉండదు? కనీసం ఒక్కసారైనా అలాంటి ఉద్యోగం వస్తే బాగుండు అని అందరూ అనుకుంటారు. సరదాగా కాలక్షేపం చేసి పని ముగించుకుని లక్షల్లో జీతం తీసుకుంటే అబ్బా ఎంత హాయిగా ఉంటుందో.. అలాంటి ఉద్యోగాలు ఇవే..

 

చాక్లెట్ రుచి చూడటం. కొన్ని కంపెనీలలో, చాక్లెట్ వాసన, రుచి, రంగు ,దాని అభిప్రాయం చెప్పడమే పని. గోడివా చాక్లెట్ తయారీదారు అటువంటి ఉద్యోగులకు 30 నుండి 60 వేల డాలర్ల జీతం ప్యాకేజీని చెల్లిస్తుంది, అంటే 25 నుండి 50 లక్షల రూపాయలు.

మంచం మీద పడుకోవడం కంటే మంచి పని ఇంకేం ఉంటుంది చెప్పండి.. అదే ఉద్యోగం ఇస్తే..? సిమోన్ హార్న్ లిమిటెడ్, ఒక విలాసవంతమైన పరుపు కంపెనీ, బెడ్‌లను పరిచయం చేయడానికి ముందు వాటి నాణ్యతను తనిఖీ చేయడానికి సిబ్బందిని నియమించింది. మంచంపై పడుకుంటే లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఇలాంటి ఉద్యోగాలు ఈమధ్య చాలానే ఉంటున్నాయి.. అయితే ఇది అనుకున్నంత తేలిక ఏం కాదు..!

చైనాలో చాలా కంపెనీలు తమది పెద్ద కంపెనీ అని చూపించడానికి అధికారుల వేషం కోసం మాత్రమే వ్యక్తులను నియమించుకుంటాయి. వీరిని సూడో అడ్మినిస్ట్రేటర్లు అంటారు. వారు కంపెనీ గురించి మంచి అభిప్రాయాన్ని పొందడానికి మాత్రమే ఉన్నారు. పని లేదు. అంతే కాకుండా ఇక్కడ బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌గా నటించడానికి కూడా డబ్బు చెల్లిస్తారు.

పాండా ప్రపంచంలోని అత్యంత అందమైన జీవులలో ఒకటి. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న పరిశోధనా కేంద్రంలో ఎలుగుబంటి సంరక్షణకు ఎంపికైన వారికి 32 వేల డాలర్లు లేదా 26-27 లక్షల రూపాయల జీతంతో ఉద్యోగం ఇస్తారు.

స్కూబా డైవింగ్. ఈ ఉద్యోగంలో, 30 వేల డాలర్లకు పైగా అంటే 25 లక్షల ప్యాకేజీ అందుబాటులో ఉంది. అధికారికంగా దీనిని వాటర్ స్లైడ్ టెస్టర్ అని పిలుస్తారు. ఇందులో కృత్రిమ నీటి వనరుల క్షీణతను పరిశీలించి నీటి నాణ్యతను పరిశీలించాలి. సర్ఫింగ్ ఔత్సాహికులకు ఇది గొప్ప పని.

Read more RELATED
Recommended to you

Exit mobile version