ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలిపోయిన ఖాళీలను త్వరలోనే భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మిగిలిన సచివాలయ ఉద్యోగాల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ జారీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాల్లో పోస్టుల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సేకరించింది.
ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు, ఏ పోస్టులో భర్తీ కాలేదో సోమవారం సాయంత్రం నాటికి తెలపాలంటూ పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ సాయంత్రానికే పంపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రేపు లేదంటే బుధవారం ఆ వివరాలను సంబంధిత శాఖల అధికారులకు పంపి నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు చేపట్టనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు.