ఈ కొత్త సంవత్సరం ప్రపంచానికి అంతలా కలిసి వచ్చినట్లుగా లేదు.. ఎక్కడ చూడు నిత్యం ఏదో ప్రమాదాలకు సంబందించిన వార్తలే.. అసలే కరోనాతో అల్లాడిపోతున్న వారి పాలిట అగ్ని ప్రమాదాలు, కొన్ని కంపెనీల గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణ నష్టాలు, తుఫానులు ఇలా ప్రకృతి వైపరిత్యాలతో పాటుగా, మానవ తప్పిదాల వల్ల పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి.. ఇక విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే మరో రెండు మూడు చోట్ల గ్యాస్ లీక్ ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేసింది..
ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబాయిలో కూడా ఇలాంటి ప్రమాదం ఒకటి చోటుచేసుకున్నదట.. ముంబైలోని చెంబూర్ సమీపంలోని గోవండి (ఈస్ట్) ప్రాంతంలో గల యూఎస్ విటమిన్ ఫార్మా కంపెనీ నుంచి శనివారం రాత్రి 9.53 నిమిషాలకు గ్యాస్ లీక్ అయినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఇక ఈ గ్యాస్ లీక్ అవడం వల్ల దీని ప్రభావం ఐదు ప్రాంతాలపై తీవ్రంగా పడగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారట.. కాగా ఈ సంఘటన గురించి తెలుసుకున్న ముంబై అధికారులు 17 బృందాలను అక్కడికి పంపి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి పరిస్దితిని అదుపులోకి తెచ్చినట్టు తెలిపారు..
ఇకపోతే విశాఖ గ్యాస్ లీక్ తో రెండు మూడు గ్రామాలో ఉక్కిరిబిక్కిరితో అన్ని ప్రాణాలు పోగా.. భారీ జనాభా ఉన్న ముంబాయి నగరంలో గనుక ప్రమాదం తీవ్రతరం అయితే పరిస్దితి ఏంటనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది..