బిగ్‌బాస్ 4 హోస్ట్‌గా టాప్ స్టార్‌..!

-

తెలుగులో బిగ్‌బాస్ విజ‌య‌వంతంగా మూడు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేసిన సీజన్ 1.. నేచురల్ స్టార్ నాని హోస్టింగుతో సీజన్ 2.. కింగ్ నాగార్జున హోస్ట్ గా సీజన్ 3  ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ఏదేమైనా తొలి రెండు సీజ‌న్ల‌తో పోలిస్తే కంటెస్టెంట్ల ప‌రంగాను, హోస్టింగ్ ప‌రంగాను మూడో సీజ‌న్ అంచ‌నాలు అందుకోలేద‌ని చెప్పేవాళ్లే ఎక్కువుగా ఉన్నారు. ఓవ‌రాల్‌గా మాత్రం బిగ్‌బాస్ అనేది తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతోంద‌న్న మాట మాత్రం వాస్త‌వం. ఎందుకంటే తాజా బిగ్‌బాస్‌కు వ‌చ్చిన 8.5 కోట్ల ఓటింగే ఇందుకు నిద‌ర్శ‌నం.

ఇక బిగ్‌బాస్ 3 ఫైన‌ల్స్‌లో గెలిచిన రాహుల్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు. ఇక బిగ్‌బాస్ 3కు నాగార్జున హోస్ట్ అన‌గానే భారీ అంచ‌నాల‌తో ఉన్న ప్రేక్ష‌కులు నాగ్ హోస్టింగ్ చూసి డిజప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే నాగ్ షో ఫాలో అవ్వ‌కుండా త‌నకు తెలిసిన ఒక‌టి, రెండు ట్రిక్కుల‌తోనే షోను న‌డిపించేశాడు. ఇక ఇప్పుడు వ‌చ్చే యేడాది స్టార్ట్ అయ్యే బిగ్‌బాస్ 4 హోస్ట్ ఎవ‌రు ? అన్న‌ది ఆసక్తిక‌ర ప్రశ్న‌గా మారింది.

ఇక బిగ్‌బాస్ 3కు ఫైన‌ల్ గెస్ట్‌గా వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి అయితేనే క‌రెక్ట్ అని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. ఫైన‌ల్ షోలో మెగాస్టార్ ప్ర‌త ఒక్క‌రి మీద సెటైర్లు వేసి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచారు. అటు పార్టిసిపెంట్ల‌తో పాటు ఇటు త‌న కోలిగ్ నాగార్జున‌ను కూడా ఆడుకున్నారు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే స్క్రిఫ్ట్‌తో ప‌నిలేకుండా చిరు టైమింగ్ అదిరిపోయింది. ఇటు కంటెస్టెంట్ల‌ను కూడా ప్ర‌తి ఒక్క‌రిని పేరు పేరునా ప‌ల‌క‌రించారు.

ఇక గ‌తంలో ముందుగా నాగార్జున మీలో  ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్ చేసిన త‌ర్వాత మ‌ర‌స‌టి యేడాది చిరంజీవి చేశారు. ఇక ఇప్పుడు బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున వంతు అవ్వ‌డంతో ఇప్పుడు చిరు వంతు వ‌చ్చింది. ఇక బాలీవుడ్లో స‌ల్మాన్‌ఖాన్‌, త‌మిళ్లో క‌మ‌ల్‌హాస‌న్ హోస్టులుగా ఆ షోకు ఎంత క్రేజ్ తెచ్చారో చూశాం. ఇక ఇప్పుడు చిరు కూడా వ‌చ్చే సీజ‌న్ హెస్ట్‌గా ఉంటే తెలుగు బిగ్‌బాస్ షోకు ఇండియ‌న్ రేంజ్లో క్రేజ్ రావ‌డం ఖాయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version