బిగ్ బాస్ కంటెస్టెంట్ సావిత్రి… యాంకరింగ్ నుంచి బిగ్ బాస్ వరకు..!

-

తెలంగాణ యాసను ఔపోసన పట్టి.. ఆ యాసకు కొత్త అర్థాన్ని తెచ్చింది సావిత్రి. అందుకే.. సావిత్రికి అంత డిమాండ్. తీన్మార్ వార్తలు చదివితే సావిత్రీయే చదవాలి.. అనేంతలా తెలంగాణ యాసను ఒడిసి పట్టుకుంది సావిత్రి.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. 100 రోజుల పాటు ఇక పండుగే పండుగ. రోజు రాత్రి 9.30 ఎప్పుడవుతుందా? బిగ్ బాస్ షో ఎప్పుడు చూడాలా? అని ఆతృతగా ఎదురు చూసేవాళ్లు కోట్లలో ఉన్నారు. బిగ్ బాస్ అంటే అంతే మరి. దానికి ఉన్న క్రేజే వేరు.

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్లలో ఫేవరేట్ ఎవరు అంటే మాత్రం అందరూ టక్కున చెప్పే పేరు సావిత్రి. అదేనంటి తీన్మార్ సావిత్రి. ఇక నుంచి ఆమెను తీన్ మార్ సావిత్రి లేదా వీ6 సావిత్రి అని పిలవకండి. బిగ్ బాస్ సావిత్రి అని పిలవండి.

తెలంగాణ యాసను ఔపోసన పట్టి.. ఆ యాసకు కొత్త అర్థాన్ని తెచ్చింది సావిత్రి. అందుకే.. సావిత్రికి అంత డిమాండ్. తీన్మార్ వార్తలు చదివితే సావిత్రీయే చదవాలి.. అనేంతలా తెలంగాణ యాసను ఒడిసి పట్టుకుంది సావిత్రి.

తన టాలెంట్ ను నమ్ముకొని… అంచెలంచెలుగా ఎదిగి.. చివరకు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా సెలక్ట్ అయిందంటే మామూలు విషయం కాదు. దాని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది.

సరే.. ఇదంతా ఓకే కానీ.. అసలు సావిత్రి ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఊరు ఆమెది? ఆమెకు పెళ్లయిందా? పెళ్లయితే భర్త ఏం చేస్తాడు? పిల్లలు ఉన్నారా? ఆమె తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇలా.. సవాలక్ష ప్రశ్నలు మీ మదిలో మెదులుతూనే ఉంటాయి. వాటికి సమాధానమే ఈ కథనం.

నిజానికి సావిత్రి అసలు పేరు సావిత్రి కాదు. శివజ్యోతి. ఆమెది.. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్న బాల్కొండ మండలంలోని నాగంపేట గ్రామం. ఆమె తల్లిదండ్రుల పేర్లు రాజమల్లేశ్, యశోద. ఆమె తల్లి బీడీ కార్మికురాలు కాగా.. తండ్రి ఆర్ఎంపీ డాక్టర్. వాళ్లది మధ్య తరగతి కుటుంబం.

శివజ్యోతి నాగంపేటలో ఏడో తరగతి వరకు చదివింది. 8 నుంచి 10 వరకు రేంజర్ల అనే గ్రామంలో చదివింది. ఇంటర్ నిజామాబాద్ లో చదివింది. తర్వాత హైదరాబాద్ లో యశోద ఆసుపత్రిలో బీఎస్సీ నర్సింగ్ కోర్స్ లో చేరింది. కానీ.. నర్సింగ్ కోర్సును మధ్యలోనే వదిలేసి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసింది.

అయితే.. చిన్నప్పటి నుంచి సావిత్రికి యాంకర్ కావాలనే ఆశ ఉండేది. అందుకే.. ముందుగా కొన్ని రోజులు ఓ చానెల్ లో యాంకరింగ్ చేసింది. అయితే.. ఆ చానెల్ లో నీ భాష బాగలేదు. నీ భాష మార్చుకోవాలి.. గొంతు మార్చుకోవాలి అని అన్నారట. అంటే తెలంగాణ యాసను మార్చుకోవాలన్నారు. ఇలా మాట్లాడితే మీడియాకు పనికిరావు అని కూడా అన్నారు. కానీ.. ఆ తర్వాత అదే గొంతు కోసం తీన్మార్ వార్తలు ఎదురు చూశాయి. తర్వాత ఆమె తెలంగాణ యాస ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. సావిత్రికి పెళ్లి అయింది. ఆమెది లవ్ మ్యారేజ్. ఆమె భర్త పేరు గంగూలీ. ఆయన మార్కెటింగ్ జాబ్ చేస్తాడు.

ఇది.. బ్రీఫ్ గా సావిత్రక్క జీవితం. మొత్తానికి తీన్మార్ నుంచి బిగ్ బాస్ ఎత్తుకు ఎదిగిన సావిత్రక్కకు అందరం బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం.

Read more RELATED
Recommended to you

Latest news