Bigg Boss Telugu 3 Episode 14: మహేశ్, రాహుల్, హిమజ, శ్రీముఖి సేఫ్.. వరుణ్, వితిక, పునర్నవి, జాఫర్ లలో ఒకరు ఔట్..!

-

మరోవైపు నిన్నటి ఎపిసోడ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా కింగ్ నాగార్జున నిలిచారు. యాజ్ యూజువల్ గా ఆయన ఇంటి సభ్యులతో ప్రవర్తించిన తీరు అద్భుతంగా ఉంది. షోను ఎక్కడికో తీసుకెళ్లారు.

బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే 13 రోజులు గడిచిపోయాయి. అంటే ఇంచుమించు రెండు వారాలు. మొదటి వారంలో అంతా కలిసి ఉన్న ఇంటి సభ్యులు.. రెండో వారం గడిచే సరికి గ్రూప్స్ గా విడిపోయారు. గొడవలు పెరిగాయి. ఒకరిని మరొకరు విమర్శించుకోవడం ప్రారంభించారు. దీంతో బిగ్ బాస్ షో కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది.

మరోవైపు నిన్నటి ఎపిసోడ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా కింగ్ నాగార్జున నిలిచారు. యాజ్ యూజువల్ గా ఆయన ఇంటి సభ్యులతో ప్రవర్తించిన తీరు అద్భుతంగా ఉంది. షోను ఎక్కడికో తీసుకెళ్లారు.

మీకు ఇంకో విషయం తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు బిగ్ బాస్ షోను నాలుగున్నర కోట్ల మంది వీక్షించారట. రోజు వీక్షిస్తున్నారట. నాలుగున్నర కోట్ల మంది అంటే మామూలు మాటలు కాదు కదా. మొదటి, రెండో సీజన్ల కంటే కూడా మూడో సీజన్ కు ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఇక.. నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే.. నిన్న ఎలిమినేషన్ లో ఉన్న ఎనిమిది మందిలో నలుగురిని సేవ్ చేశారు నాగార్జున. వాళ్లలో మొదట సేవ్ అయింది మహేశ్ విట్ట, ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్, హిమజ, శ్రీముఖి సేవ్ అయ్యారు.

ఇక.. మిగిలింది వరుణ్, వితిక, జాఫర్, పునర్నవి… ఈ నలుగురిలో ఎవరో ఒకరు ఇవాళ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఆ విషయం ఇవాళ్టి ఎపిసోడ్ లో తెలుస్తుంది.

ఇక.. నాగ్.. హౌస్ లో జరుగుతున్న చిన్నచిన్న గొడవల గురించి ఇంటి సభ్యులతో చర్చించారు. అలీ, తమన్నా గొడవపై, మహేశ్, వరుణ్ గొడవపై కూడా స్పందించి.. వాళ్లకు సర్ది చెప్పారు. ఇంటి సభ్యులు తమ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. పవర్ గేమ్ లో భాగంగా కిరీటం కోసం పోటీ పడుతుండగా.. అలీ నెట్టేయగా శివజ్యోతి కింద పడిపోవడంపై కూడా నాగ్ స్పందించారు. ఆమె స్పిరిట్ ను నాగ్ మెచ్చుకున్నారు.

హీరో అండ్ విలన్

అయితే.. ఈసందర్భంగా నాగ్.. ఇంటి సభ్యులతో ఓ గేమ్ ఆడించారు. రెండు కిరీటాలు తీసుకొచ్చి… ఇందులో హీరో ఎవరు.. విలన్ ఎవరో ఇంటి సభ్యలు ప్రతి ఒక్కరు తమకు నచ్చిన వాళ్ల తలపై పెట్టాలని సూచిస్తారు. అయితే… ఎక్కువ హీరో కిరీటాలు బాబా బాస్కర్ కు రాగా… ఎక్కువ విలన్ కిరీటాలు వరుణ్, తమన్నాకు వచ్చాయి. సరే.. ఇవాళ్టి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం.. ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news