బ్రేకింగ్‌: బిగ్‌బాస్ ఎలిమినేష‌న్లో అత‌డు అవుట్‌… అంచ‌నా త‌ప్ప‌లేదు

-

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమై ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకుంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు మొదట్లో బాగానే రేటింగ్స్ వచ్చినా ఆ తరువాత వారాల్లో రేటింగ్స్ తగ్గుముఖం పట్టాయి. ఇక ఇప్ప‌టికే షో ఫైన‌ల్‌కు చేరుకోవ‌డంతో ఆట ర‌క్తి క‌డుతోంది. ఇక ఈ వారం మొత్తం హౌస్‌లో 8 మంది ఉండ‌గా ఒక‌రు ఎలిమినేట్ అవుతార‌న్న అంచ‌నాలు ముందు నుంచే ఉన్నాయి.

ఇక ఈ వారం ఎలిమినేషన్ కు రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, మహేశ్ విట్టా నామినేట్ అయ్యారు. ఈ ముగ్గురిలో డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని అనుకున్నా సింగిల్ ఎలిమినేష‌న్ జ‌రిగింది. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మ‌హేశ్ విట్టాను హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఇక ముందు నుంచే మ‌హేశ్ ఎలిమినేట్ అవుతాడ‌నే అంద‌రూ అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ అంచ‌నాలు త‌ప్ప‌కుండా మ‌హేశ్‌నే ఎలిమినేట్ అయ్యాడు.

ఈ వారం ఎలిమినేష‌న్లోకి మ‌హేశ్ తో పాటు ఏ వితిక‌నో లేదా శివ‌జ్యోతో వ‌స్తే మ‌నోడు సేవ్ అయ్యేవాడు. కానీ అటు ఇద్ద‌రు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు రాహుల్‌, వ‌రుణ్ ఉండ‌డంతో మ‌హేశ్ ఎలిమినేట్ కాక త‌ప్ప‌లేదు. మ‌హేశ్ అటు శ్రీముఖి, బాబా భాస్క‌ర్‌కు టార్గెట్ అవ్వ‌డంతో వాళ్ల ఫ్యాన్స్ సైతం మ‌హేశ్‌కు యాంటీగా ఓట్లు వేసిన‌ట్టు తెలుస్తోంది.  నిజానికి మహేశ్ విట్టా గత వారమే ఎలిమినేట్ అవుతాడని అందరూ భావించినా పునర్నవికి తక్కువ ఓట్లు రావటంతో మహేశ్ సేవ్ అయ్యాడు. కానీ ఈ వారం మాత్రం మహేశ్ ఎలిమినేట్ కాక త‌ప్ప‌లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version