యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కొన్ని వరుస ప్లాపుల తర్వాత ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకుంది హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. రామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది ఆమె నబా నటేష్. ఇస్మార్ట్ సక్సెస్ తో ఈ ఇద్దరు భామలకు ఇప్పుడు టాలీవుడ్లో వరుస ఛాన్సులు వస్తున్నాయి.
అంతలోనే ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చేసింది. ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇస్మార్ట్ శంకర్, మజ్ను లాంటి సినిమాలతో కుర్రకారుకు బాగా దగ్గరైన ఆమె యూత్‌ను తన అందచందాలతో బాగా హీటెక్కిస్తోంది. మరి ఈ టైంలో ఆమె పెళ్లి చేసుకోవడం అంటే మరి యూత్ బాగా ఫీలవుతారేమో..!
అసలే ఫామ్‌లో ఉంది.. మంచి ఛాన్సులు కూడా వస్తున్నాయి. మరి ఈ టైంలో ఆమె ప్రేమ పెళ్లి ఎందుకు చేసుకుంటుందా ? అన్న డౌట్లు వస్తున్నాయి. అసలు ఎందుకు ఈ న్యూస్ ప్రచారంలోకి వచ్చిందంటే .. నిధి తాజగా తన ఇంస్టాగ్రామ్ స్టేటస్‌లో పెట్టిన పోస్టే. రిలేషన్ షిఫ్ స్టేటస్ అన్న కాలంలో ఆమె ఎంగేజ్డ్ అన్న కామెంట్ పెట్టింది. దీంతో ఆమెకు పెళ్లి ఫిక్స్ అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది.
దీంతో నెటిజన్లు ఆమెను పెళ్లి కుదిరిందా ? వరుడు ఎవరు ? అని ప్రశ్నలు వేస్తున్నారు. దీనిపై నిధి స్పందిస్తూ ప్రస్తుతం తన కాన్సంట్రేషన్ అంతా సినిమాల మీదే ఉందని చెప్పింది. తానేం పెళ్లి చేసుకోవడం లేదని చెప్పింది. ఇక అప్పట్లో నభా ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.