బిగ్‌బాస్‌లోకి సుడిగాలి సుధీర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..?

-

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలతో కమెడియన్ సుధీర్‌కు ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ షోల వల్ల చాలా మంది కమెడియన్ల జీవితాలే మారిపోయాయి.

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలతో కమెడియన్ సుధీర్‌కు ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ షోల వల్ల చాలా మంది కమెడియన్ల జీవితాలే మారిపోయాయి. వారికి కోకొల్లలుగా సినిమా చాన్సులు కూడా వచ్చాయి. అయితే చాలా మంది కమెడియన్లు సినిమాల్లో చాన్సులు పెరిగేసరికి ఈ షోలను వదిలేశారు. కానీ సుధీర్ మాత్రం ఈ షోలతోపాటు ఈటీవీలో పలు ఇతర షోలను కూడా చేస్తున్నాడు. అయితే ఇకపై సుధీర్ బిగ్‌బాస్ షోలోనూ కనిపించనున్నాడట.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 ఎంతో ఆసక్తిగా సాగుతోంది. ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండడంతో ఈ సీజన్‌ను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రసుతం ఈ షో 13 ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటికే తొలివారంలో నటి హేమ ఎలిమినేట్ అవగా ఆమె స్థానంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక రెండో వారం ఎలిమినేట్ అయ్యే వారి స్థానంలో సుడిగాలి సుధీర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం సాగుతోంది.

సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోలలో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే సుధీర్ బిగ్‌బాస్ ఎంట్రీ ఇస్తే హౌస్‌లో చక్కని ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకనే సుధీర్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో హౌస్‌లోకి రప్పిస్తున్నారట. కాగా మొదటి సీజన్‌లో జబర్దస్త్ కమెడియన్ ధన్‌రాజ్ హౌస్‌లో ఎంతటి వినోదాన్ని పంచాడో అందరికీ తెలిసిందే. కానీ రెండో సీజన్‌లో కమెడియన్లను తీసుకోలేదు. దీంతో షో చప్పగా సాగిందని అభిమానులు పెదవి విరిచారు. అయితే ఈసారి కచ్చితంగా ఓ కమెడియన్‌ను ముందుగా తీసుకుందామని అనుకున్నారట. కానీ అది వీలుకాకపోవడంతో ఇక వైల్డ్ కార్డ్ రూపంలో సుధీర్‌ను హౌస్‌లోకి పంపిస్తున్నారట. మరి సుధీర్ నిజంగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడా, లేదా.. అన్న వివరాలు తెలియాలంటే.. రేపటి బిగ్‌బాస్ ఎపిసోడ్ వరకు వేచి చూడక తప్పదు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version