ఈ ఏడది మధ్యంతర బడ్జెట్ కావడం వలన ఎలాంటి అద్భుతమైన ప్రకటనలు ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు ఫిబ్రవరి 1న ప్రకటించబోయే బడ్జెట్ కోసం ఓట్ ఆన్ అకౌంట్ మాత్రమే అవుతుంది. ఏప్రిల్ మే లో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి బడ్జెట్ వస్తుంది. మధ్యంతర బడ్జెట్లో అధిక వెయిటేజ్ కలిగిన ప్రధానా 5 అంశాల గురించి ఇప్పుడు చూద్దాం.
ఉద్యోగాలు:
ఎన్నికల తరుణం లో దేశంలో వేగంగా పెరుగుతున్న యువతకి తగిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లేవని ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం సరైన అవకాశాన్ని నిరుద్యోగులకు కల్పించాల్సిన అవసరం ఉంది లేకపోతే భారత జనాభా తీవ్ర నిరాశకి గురి అవ్వచ్చు.
ద్రవ్య లోటు మీద దృష్టి పెట్టడం:
ద్రవ్య లోటు ని అదుపులో ఉంచుకునే చర్యలు చేపడుతుందా అనేది కూడా ముఖ్యమైన అంశం. దేశ జిడిపిలో ఐదు పాయింట్ మూడు శాతానికి తగ్గించే చర్యలు తీసుకోవచ్చు.
మూల ధన వ్యయం:
మౌలిక సదుపాయాల రంగం కోసం మద్యంతర బడ్జెట్లో మూల ధన వ్యయాన్ని పెంచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి.
సంక్షేమం:
కేంద్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకి నిధులు పెంచే అవకాశం కూడా ఈ సారి కనబడుతోంది.
వినియోగం:
భారత ప్రైవేట్ వినియోగం 2019 నుండి వేగంగా పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వినియోగాన్ని పెంచే విధానాల్ని ఆర్థిక మంత్రి ప్రతిపాదించొచ్చు