రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కలిసి కట్టుగా పని చేద్దాం : వంశీ చందర్ రెడ్డి

-

పది సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉండి కాంగ్రెస్ జెండా మోసి పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని అందించిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికలు సమావేశానికి వంశీచందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

దేశం కోసం దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను దార పోశారు. సోనియాగాంధీ అధికారాన్ని లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన మన రాహుల్ గాంధీ పార్టీని బలోపేతం చేయడానికి చెమటోడుస్తున్నారు. దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తూ.. ప్రతిఒక్కరిలో ఉత్సాహాన్ని తెస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామిలను విస్మరించింది. దేశ సంపదను అంతా అంబానీ, అదానీ లాంటి పెట్టుబడిదారులకు దోచిపెట్టింది. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలందరూ పని చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version