పార్లమెంట్‌లో బడ్జెట్ ముందు హల్వా వేడుక ఎందుకు జరుపుతారో తెలుసా ?

-

పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి కొద్దిరోజుల ముందు అధికారులకు స్వీట్స్ పంచే కార్యక్రమం జరుగుతోంది. ఆర్థిక మంత్రి సాధారణంగా తన సహచరులకు హల్వా ఇస్తారు . బడ్జెట్ తయారీలో పాల్గొనే సీనియర్ అధికారుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది. పార్లమెంట్ లోని నార్త్ బ్లాక్‌లో హల్వా వేడుకను క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. బడ్జెట్ తయారీలో పాల్గొన్న సిబ్బంది అందరికీ హల్వా అందించబడుతుంది.

హల్వా వేడుక అనంతరం బడ్జెట్‌ తయారీలో నిమగ్నమైన అధికారులను పార్లమెంట్‌లోనే ఉంచుతారు. బడ్జెట్ ప్రెజెంటేషన్ పూర్తయ్యే వరకు వారు బయటకు వెళ్లడానికి లేదా ఇంకా వారి ఇళ్లకు వెళ్లడానికి అనుమతించరు అలాగే వారు Gmail లేదా సోషల్ మీడియాను ఉపయోగించడానికి అనుమతించరు, చివరికి ఫోన్ కూడా ఉపయోగించబడదు. బడ్జెట్‌లో గోప్యత పాటించేందుకు అధికారులు ఇలా వారిని ‘లాక్‌’ చేస్తారు. అయితే ఉన్నతాధికారులు మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా  ఈ వేడుకను 2022లో నిర్వహించలేదు.  అయితే హాల్వా వేడుక నిర్వహించనప్పటికీ హల్వా వేడుకలకు బదులు అధికారులు, ఉద్యోగులకు స్వీట్లు పంచి పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version