Father’s Day: నాన్న..నా సర్వస్వం.. నా మార్గదర్శకం..

-

నాన్న.. ఈ పిలుపు ఎంత మధురమైంది..అమ్మ తన రక్త, మాంసాలను ధారపోసి ఇస్తే..నాన్న తన ప్రాణాన్ని ఇస్తాడు.. అందుకే మన తొలి అడుగు నాన్న తో వేస్తాము..ఈ భూ ప్రపంచంలో నాన్న చూడని లోకాన్ని దగ్గరుండి చూపిస్తాడు.అమ్మ ఆకలిని చూస్తుంది..కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది.. కానీ నాన్న ప్రేమ గుండెలను దాటి కన్నీళ్ళలో చూపిస్తాడు..పిల్లలు కలిగిన తర్వాత నాన్న లోకం వాళ్ళే..అమ్మాయిలు ఎక్కువగా నాన్న కూచిలు అంటారు.కానీ ఆయనకు మాత్రం ఇద్దరు ఒక్కటే..అలా నాన్నకు మనం ప్రేమతో ఒక్క చిరునవ్వు ఇస్తే పొంగి పోతాడు..

 

అడుగులు వేసే వయస్సు నుంచి అక్షరాలు దిద్దే వరకూ అన్నీ తానై చూసుకుంటాడు..పెరిగి పెద్దైయ్యెవరకు దగ్గరుండి తన భుజాల మీద వేసుకొని జీవిత చక్రాన్ని నడిపిస్తాడు.అందుకే నాన్నంటే అందరికి ఇష్టం..తన వయస్సు మీద పడిన పిల్లల కోసం ఆరాట పడతాడు..ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న ఒక భాగం..ఆయన లేకుండా మనకు జీవితం లేదు..సమాజంలో విలువ లేదు..

 

అందరి జీవితంలో తండ్రి ఒక రోల్ మోడల్ , గైడ్, సూపర్ హీరో, స్నేహితుడు, సంరక్షకుడు. నాన్నలు పిల్లలకు అన్ని సమయాల్లో అండగా ఉంటాడు. కస్టమైనా సుఖమైనా.. ఎవరు మనకు తోడుగా ఉన్నా లేకపోయినా.. నాన్న మాత్రం మనతోనే ఉంటారు. జీవిత సత్యాలను భోదిస్తాడు. అందుకే ఒక తండ్రి త్యాగాన్ని గుర్తించడానికి ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డేను జరుపుకుంటారు..ఆరోజు నాన్నకు ఒక కానుక ఇచ్చి సరి పెట్టుకుంటే సరిపోదు..జీవితాంతం ప్రేమగా చూసుకోవాలి..అది మన కర్తవ్యం.. జీవిత పరమార్దం.. హ్యాపీ ఫాదర్స్ డే..

 

Read more RELATED
Recommended to you

Latest news