Gandhi jayanthi 2022: జీవితాన్ని సన్మార్గంలో నడిపే 10 సుత్రాలు ఇవే..

-

మనల్ని బానిస బ్రతుకు నుంచి బయట పడేలా ప్రెరెపించిన వ్యక్థులలో ఒకరు మహాత్మ గాంధీ..మహాత్మా గాంధీ అంటే అహింసా మార్గాన్ని అనుసరించి దేశానికి స్వాతంత్ర్యం అందించడంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడిగా మనందరికీ తెలుసు. ఆయన సహనం, సత్యం అనే మార్గాన్ని అనుసరిస్తే కష్టతరమైన పోరాటాల్లో విజయం సాధించవచ్చని నిరూపించిన వ్యక్తిగాను అందరికి తెలుసు..అక్టోబరు 2, 1986న జన్మించిన మహాత్మా గాంధీ ఆలోచనలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

భారతదేశంలోనే కాదు.. ఆయన మాటలు విదేశాల్లోని ప్రజలపై ప్రభావం చూపించాయి. మహాత్మా గాంధీ ఆలోచనలు జీవితానికి కొత్త కోణాన్ని అందిస్తాయి.ఆయన ఆలోచనలు ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతాయి. మహాత్మా గాంధీ త్యాగం, సంయమనం, సరళతకు ఉదాహరణ. అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి..ఈ సందర్భంగా కొన్ని జీవిత సుత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పాపాన్ని ద్వేషించండి, పాపిని ప్రేమించండి.

శ్రద్ధ అంటే విశ్వాసం. విశ్వాసం అంటే భగవంతునిపై విశ్వాసం.
మీరు నిజమైన వారిని కోల్పోయే వరకు.. మీకు ఎవరు ముఖ్యమో అర్థం చేసుకోలేరు.
మనం ఎవరిని ఆరాధిస్తామో వారిలా అవుతాము.
మనిషి తన ఆలోచనల ద్వారా సృష్టించబడిన జీవి. ఏమనుకుంటున్నాడో అదే అవుతాడు.
మనం చేసే పనికి ఫలితం ఎలా ఉంటుందో ఎప్పటికీ తెలియదు.
కానీ, దాని కారణంగా ఆ పనిని ఆపవద్దు. ఎల్లప్పుడూ పని చేస్తూ ఉండండి.
తప్పులు చేసే స్వేచ్చ లేని చోట ఆ స్వేచ్ఛకు విలువ ఉండదు.
ఆత్మగౌరవాన్ని కోల్పోవడమే ప్రపంచంలో అతిపెద్ద నష్టం. ఇంతకంటే పెద్ద నష్టాన్ని ఊహించలేను.
మీరు ప్రపంచంలో ఏ మార్పును చూడాలనుకుంటున్నారు. అది మీతోనే ప్రారంభించండి.
ఒక దేశం గొప్పతనాన్ని, దాని నైతిక పురోగతిని అక్కడ జంతువులను చూసే విధానాన్ని బట్టి అంచనా వేయవచ్చు.
తెలిసో,తెలియకో తప్పు చేస్తే దానిని దాచుకునే ప్రయత్నం చెయ్యకూడదు.అంతకంటే పెద్ద పాపం అవుతుంది.
నా మతం సత్యం, అహింసపై ఆధారపడింది. సత్యమే నా దేవుడు, దానిని సాధించడానికి అహింసయే సాధనం.

Read more RELATED
Recommended to you

Exit mobile version